రైతులను కాపాడుకోవలసిన బాద్యత ప్రతి ఒక్క పౌరుని పై ఉంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  దేశానికి రైతు వెన్నుముఖ అనిరైతు లేనిదే దేశం లేదని,దేశం లో రైతులను  కాపాడుకోవలసిన బాద్యత ప్రతి ఒక్క పౌరుని పై ఉందని తెలంగాణా రైతు హక్కుల సాదన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం నర్సింహులు అన్నారు. నేడు దేశం లో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆదార పడి ఉన్నారనికాని గిట్టుబాటు దర లేక దేశానికి అన్నం పెట్టె రైతులు ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం  చేసారు. ఫర్టలైజర్స్ ధరలు పెరగటంఅతి వృష్టి అనా వృష్టి అకాల వర్షాలుఅదిక వడ్డిలకు రుణాలు వంటి అనేక కారణాలతో నేడు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరన్నారు. అంతే కాకుండా పంట పండి మార్కెట్కు వెలితే దళారుల దోపిడిలు రైతులను బలితీసుకుంటున్నాయన్నారు.పరిశ్రమల పెరుతో వ్యవసాయ భూమి తగ్గటం ,వ్యవసాయం చేసే రైతుల సంఖ్య రోజురోజుకు తగ్గి పోతుందన్నారు.ఇలాంటి పరిస్థితులను పాలకులు సరిదిద్దకపోతే ప్రజలకు ఆహరం దొరకని రోజులు వస్తాయనిదేశం లో ఆకలి చవులు పెరిగే అవకాశం లేకపోలేదన్నారు. నేడు అన్నం పెట్టి రైతుల విష్యం లో ప్రభుత్వాలు సవతి తల్లి ప్రెమను కాన బర్చుతున్నయన్నారు.రాష్ట్రము లో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎల్ల వేళల కృషి చేస్తానన్నారు. ప్రస్తుత పరిస్థుల్లో వ్యవసాయం బారమై పోయిందనిగిట్టుబాటు ధర  లబించక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరన్నారు. ఏ జీవి జీవించాలన్న ఆహారం కావాలి. అటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసే రైతులు వ్యవసాయంలో వరుసగా నష్టాలకు గురౌతున్నారు. అప్పులు తీర్చలేక కొంతమది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయం చేసే రైతుల సంఖ్య తగ్గిపోతున్నది. వ్యవసాయం చేసే భూ పరిమాణం కూడా తగ్గుతుంది. రైతు కొడుకు వ్యవసాయం చేసే బదులు మరో పనికోఉద్యోగానికో వలస పోతున్నాడు. మన దేశంలో పంటలు దిగుబడి తగ్గిపోయి పంటలను ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకోవాలసిన దుస్ధితి ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే భవిష్యత్తులో మరింత ఆహార కొరత ఏర్పడే ప్రమాదం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలకు ఆహారం దొరకని రోజు రావొచ్చు. రైతుల ఆత్మహత్యలుఆకలిచావులు పెరిగిపోవచ్చునన్నారు.” రైతే రాజు “” రైతే దేశానికి వెన్నముక రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పే మన దేశంలో రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాదు ఆత్మహత్యలు చేసుకునే రైతుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. రైతాంగ సమస్యలపట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. చెవిటివారి ముందు శంఖం ఊదినట్లు దున్నపోతు మీద వర్షం పడినట్లు వుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కరువైంది. రైతుల సంక్షేమం కొరకురైతులను రక్షించుకోవడానికి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఒక సంస్థ అవసరం అయ్యింది. అందుకొరకే తెలంగాణా రైతు హక్కుల సాదన సమితి ఆవిర్భవించింది. రైతుల సంక్షేమం కొరకు వివిధ వర్గాల ప్రజల మద్దతు కూడగట్టి రైతులకు భరోసా కల్పించడమే రైతు హక్కుల సాదన సమితి ప్రథమ కర్తవ్యమన్నారు.తమ సాదన సమితి పోరాటానికి  రైతులు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి మద్దతు పలుకాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.