గుట్టుచప్పుడు కాకుండా ఆర్టీసీ చార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  సామాన్యుడిపై మరో భారం. ఒకవైపు నిత్యావసరాల ధరలు మంట.. మరోవైపు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీధరలు పెరగడం..ఇలా వరుసగా సామాన్యుడికి షాక్‎లు తగులుతున్నాయి. ఇప్పుడు మరోసారి తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టోల్ చార్జీలపెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా బస్సుల్లో ఆర్టీసీ బస్సుటికెట్ చార్జీలనుపెంచింది. ఒక్కో టోల్‎తో రూ. 5 నుంచి అదనంగా టికెట్ చార్జీలు వసూలు చేస్తోంది. కొన్ని బస్సులకి రూ. 10 చొప్పున పెంపు. అదనపు టోల్‎కి..అదనపు చార్జ్. ఉదయం నుండి అన్ని బస్సుల్లో టికెట్ ఛార్జీలను ఆర్టీసీ సామాన్యుడిపై మరింత భారం వేసింది. ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా..ఏకంగా బస్ భవన్ నుండి వాట్సాప్ద్వారా ఆర్టీసి ఉద్యోగులకు సమాచారం ఇచ్చి ఆర్టీసీ చార్జీలు పెంచండంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రకటన చేయకుండా టీఎస్ ఆర్టీసీ చార్జీలను పెంచడంపై స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.