విద్యార్థుల ఆందోళన పై స్పందించిన ఐటీ మంత్రి కేటీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజాం కాలేజ్‌లో గత కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళనకు చేస్తు్న్నారు. యూజీ విద్యార్థులకు హాస్టల్ కేటాయించాలని కాలేజీలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. సోమవారం కాలేజ్ ఎదుట విద్యార్థులు మౌనదీక్ష చేపట్టారు. మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించినా.., నేటి వరకు యూజీ విద్యార్థినులకు వసతి కల్పించేందుకు అనుమతి ఇలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థులమైన తాము వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేటు హాస్టళ్లలో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు హాస్టల్‌లో వసతి కల్పించాలని కాలేజ్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని నిరసన చేపట్టారు. కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్‌ను యూజీ విద్యార్థులకు కాకుండా పీజీ విద్యార్థులకు కేటాయించటంపై వారు మండిపడుతున్నారు. డిగ్రీ స్టూడెంట్స్‌కు కొత్త హాస్టల్ బిల్డింగ్ ఇస్తామని మెుదట హామీ ఇచ్చి.., ఇప్పుడేమో పీజీ వాళ్లకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు హాస్టల్ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని తెగేసి చెబుతున్నారు. తాజాగా.. విద్యార్థుల ఆందోళనపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాలేజ్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేశారు. ఈ వివాదంపై జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి అందించిన తర్వాత వివాదం అవసరమా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఈ వివాదానికి వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్‌ను కూడా కేటీఆర్ ఆదేశించారు. కాగా.. కేటీఆర్ ట్వీట్‌పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిజాం కాలేజ్ విద్యార్థినుల హాస్టల్ సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. గతంలో నిజాం కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కళాశాల పూర్వ విద్యార్థి, మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తరఫున కాలేజ్ అభివృద్ధికి రూ.5 కోట్ల ఫండ్ కేటాయించారు. ఈ నిధులతోపాటు ఓయూ వైస్ ఛాన్స్‌లరో మరో కోటి రూపాయిల ఫండ్ కాలేజీకి మంజూరు చేశారు. ఈ నిధులతో కాలేజీ హాస్టల్ భవనం నిర్మించిన అధికారులు.. హాస్టల్ ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో వివాదం మెుదలైంది. ఆ హాస్టల్ తమకు కేటాయించాలని యూజీ విద్యార్థుల గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. తమకు హాస్టల్ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని తెగేసి చెబుతున్నారు. తాజాగా ఈ వివాదంపై మంత్రి

Leave A Reply

Your email address will not be published.