బాబును ఎదుర్కోవడానికి.. జగన్ ప్లాన్..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2019 ఎన్నికల్లో నవరత్నాలు అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. అవి ఎంతమేరకు అమలు చేశారన్నది ఆయనకే తెలియాలి. అయితే.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి ఏం చేయాలి..ఏం చెప్పి ఎన్నికలకు వెళ్లాలి..మేనిఫెస్టోలో ఏమేం పెట్టాలి..అనేది జగన్‌కు దిక్కుతోచట్లేదట. ఓ వైపు ఏపీలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంమరోవైపు రోజురోజుకూ వైసీపీకి గ్రాఫ్ తగ్గిపోతుండటంతో ఏం చేయాలో జగన్‌కు దిక్కుతోచట్లేదట. ఈ పరిస్థితుల్లో జనాలను మెప్పించడానికి ఏం ప్లానుందబ్బా అని ఆలోచించగా.. జియో టవర్స్ గుర్తొచ్చాయట. ఆలోచన వచ్చిందే ఆలస్యం వెంటనే 100 టవర్లను వర్చువల్‌గా ప్రారంభించేశారట. ప్రతి ఒక్కరి చేతిలో ప్రస్తుతం సెల్‌ఫోన్ కామన్ అయిపోయింది.. అందుకే అంబానీ సహకరంతో రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ఉచితంగా రీచార్జీలు  ఫ్రీ వైఫై సేవలుఫైబర్‌నెట్ సేవలన్నీ అందించడానికి సిద్ధమవుతున్నట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం. ఎందుకంటే.. ఇప్పటికే మిని మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు ప్రకటించగా.. అంతకుమించి చేయాలంటే ఉచిత రీచార్జ్ పథకంతో కొట్టాలన్నది జగన్ ప్లానట. అందుకే ఏం చేసినా టీడీపీ మేనిఫెస్టో‌కు మించి కలర్‌ఫుల్‌గా ఉండాలని జగన్ భావిస్తున్నారట. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోను తెలుగు తమ్ముళ్లు జనాల్లోకి విస్తృుతంగా తీసుకెళ్తున్నారు. త్వరలోనే మరో మేనిఫెస్టోను టీడీపీ రిలీజ్ చేయనుంది. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే ఇప్పుడు నవరత్నాలు అస్సలు పనికిరావని పసిగట్టిన జగన్.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అని ప్రకటించబోతున్నారట. బాబును తట్టుకోవడం చేతగాక అంబానీతో జగన్ చేతులు కలిపారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయాలన్నింటినీ ఏపీ ప్రజలు గ్రహించి.. ఏ పార్టీవైపు అడుగులేస్తారో ఏంటో మరి. చూశారుగా.. రానున్న ఎన్నికల్లో వైసీపీ భారీగానే ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ ఏ మాత్రం వర్కువుట్ అవుతాయో.. వీటన్నింటినీ తిప్పికొట్టడానికి చంద్రబాబు ఇంకేరేంజ్‌లో వ్యూహాలు రచిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.