జీవో నంబర్ 1411 విచారణ వచ్చేనెల 16కు వాయిదా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జీవో నంబర్ 1411, 344ను సవాలు చేస్తూ టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్స్‌పై విచారణ హైకోర్టులోవాయిదా వేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటును సవాలు చేస్తూ పిటిషన్స్ దాఖలయ్యాయి. అమరావతి భూములు వ్యవహారం, ఫైబర్ నెట్ స్కాంతో పాటు గత ప్రభుత్వ నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్ట్స్ సమీక్షకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 1411 జీవో జారీ చేసింది. అలాగే మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తుకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ మరో జీవో 344 వచ్చింది. ఈ రెండూ జీవోలను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య  ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టులో విచారణకు వచ్చింది. తదుపరి విచారణను వచ్చేనెల 16కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.