రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో సత్తా చాటిన జియాగూడ విద్యార్థి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ 3వ రాష్ట్ర స్థాయి షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో జియాగూడలోని విద్యాశ్రీ హైస్కూల్కు చెందిన 8వ తరగతి విద్యార్థి దర్పల్లి ఎన్. తేజాస్ కురును చక్కటి ప్రతిభ కనబర్చి సత్తాచాటాడు. గచ్చిబౌళిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్ వేదికగా తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి వారం రోజులుగా కొనసాగిన షూటింగ్ పోటీలలో జియాగూడ కేశవస్వామినగర్కు చెందిన సీనియర్ పాత్రికేయులు దివంగత దర్పల్లి బాల్ రాజ్, సంతోషి (భువన) దంపతుల కుమారుడు ధర్పల్లి ఎన్. తేజస్ ఉత్సాహంగా పాల్గొన్నాడు. 25 మీటర్ల పిస్తోల్ షూటింగ్ సబ్- జూనియర్ విభాగంలో పోటీపడ్డ దర్పల్లి ఎన్. తేజాస్ చక్కటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించి సిల్వర్ మెడల్ సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఐ.జి తరుణ్ జోషి సర్దార్ వల్లబ్బాయిపటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ అభినవ్, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్సంఘ్, ఉపాధ్యక్షుడు ఉదయ్పిలాని తదితరుల చేతుల మీదుగా తేజాస్ పతకాన్ని అందుకున్నాడు. 25 మీటర్ల పిస్తోల్ షూటింగ్ సబ్ జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించడం ద్వారా తేజాస్ త్వరలోనే జరుగబోయే జోనల్ స్థాయి. షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యాడని కోచ్ అల్లూరి ప్రసన్నకుమార్, అమిత్సంఘీలు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రముఖ బీజేపీ సీనియర్ నాయకుడు, తేజాస్ తాత దర్పల్లి నర్సింహులు, విద్యాశ్రీ హైస్కూల్ డైరెక్టర్ క్యామ్వోరా, కరస్పాండెంట్ సునీతాశ్యామ్లు తేజాస్ను ప్రత్యేకంగా అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.