23 న తెలంగాణ లోకి జోడో యాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 23వ తేదీ ఉదయం 8 గంటలకే కృష్ణ నది పై దాటి తెలంగాణ లో ప్రవేశిస్తుందని మాజీ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24, 25 తేదీలలో విశ్రాంతి ఉంటుంది. 26వ తేదీన తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. 26 నుంచి మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, హైదరాబాద్ లలో యాత్ర కొనసాగుతుంది. ఎక్కడెక్కడ యాత్ర కొనసాగుతుంది. ఎక్కడ సమావేశాలు ఉంటాయనేది త్వరలో పూర్తి సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ యాత్రలో నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్నగర్ జడ్చర్ల, షాదనగర్, రాజేంద్ర నగర్, తదితర అసెంబ్లీ నియోజక వర్గాలలో కొనసాగుతుంది. ఒక్కోరోజు ఒక్కో పార్లమెంట్ నియోజక వర్గం ప్రజలు వెంట నడుస్తారు. ఈ రోజు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు ముందుకొచ్చాయి. మహాత్మాగాంధీ దండి యాత్ర చేసినపుడు ఎలా జనం తరలి వచ్చారో అలాగే ఇప్పుడు ఉంది. రాహుల్ గాంధీ రాజకీయల కోసం పాదయాత్ర చేయడం లేదు. ప్రజల కోసం  చేస్తున్నారు అని తెల్పారు. ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల కోసం పని చేయడం లేదని, స్వాతంత్ర్య ముందు దేశం ఎలాగ ఉందొ అలాగే ఇపుడు ఉందని, దేశంలో ప్రజలు నిరాశ, నిస్పృహలతో ఉన్నారన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం.చేసే కుట్రలు జరుగుతున్నాయని, దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ ఒకే రకంగా పాలన సాగిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.