మణిపూర్‌ హింసాకాండపై సుప్రీంకోర్టుకు  జస్టిస్‌ గీతా మిట్టల్ కమిటీ నివేదిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మణిపూర్‌ హింసాకాండపై రిటైర్డ్‌ జస్టిస్‌ గీతా మిట్టల్ కమిటీ నివేదిక సమర్పించిందని సుప్రీంకోర్టు తెలిపింది. హింసాత్మక సంఘటనకు సంబంధించి మిట్టల్‌ కమిటీ మూడు నివేదికలను సమర్పించిందని సుప్రీంకోర్టు వెల్లడించింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను నివేదికను పరిశీలించి.. ఈ విషయంలో సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం కోరింది. మణిపూర్‌ హింసాకాండపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ముగ్గురు మాజీ మహిళా న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీకి మణిపూర్‌లో హింసాకాండ బాధిత ప్రజల కోసం నిర్వహిస్తున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించి నివేదికను సమర్పించే బాధ్యతను అప్పగించింది.జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్‌ను కమిటీకి చైర్మన్‌గా నియమించారు. కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) పీ జోషి, జస్టిస్ (రిటైర్డ్) ఆశా మీనన్‌ సైతం ఉన్నారు. కమిటీకి సహాయం అందించేందుకు, ఖర్చుల విషయంలో మార్గదర్శకాలను జారీ చేసింది. మణిపూర్‌లో క్రిమినల్‌ కేసుల దర్యాప్తును పర్యవేక్షించాలని మాజీ పోలీసు అధికారి దత్తాత్రే ‘దత్తా’ పద్సాల్గికర్‌కు ‘సుప్రీం’ బాధ్యతలు అప్పగించింది. కమిటీ సైతం నివేదికను త్వరలో సుప్రీంకోర్టకు సమర్పించనున్నది. గిరిజన రిజర్వేషన్ల డిమాండ్‌పై మే 3న మణిపూర్‌లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Leave A Reply

Your email address will not be published.