అస్వస్థతకు గురైన కమల్ హసన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన చెన్నైలోని పోరూర్ రామచంద్ర ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. ఆయన జ్వరంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు. కమల్హాసన్ ఇంతకుముందు కరోనా బారిన పడ్డారు. అప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తిరిగి ఇప్పుడు శ్వాస సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.