పోచారంను శాలువాతో సత్కరించిన కాసుల బాలరాజు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కాసుల బాలరాజ్ మంగళవారం కలిశారు. ఈసందర్భంగా పోచారం గారిని శాలువాతో సత్కరించిన బాలరాజు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.అనంతరం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశంలో పోచారం గారు మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాను. నా రాజకీయ జీవితం ముగిసేలోగా బాన్సువాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చడమే నా ఆశయం. మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అలాంటి ఉద్యేశం, ఆలోచన కూడా లేదు. ఉన్నత పదవులు నాకు కొత్త కాదు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధే నాకు ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో అందరిని కలుపుకుని పోతాను. ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. అంద‌రిని కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి. 1977 లో నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించాను. తదుపరి టిడిపి, టిఆర్ యస్ లలో పనిచేశాను. నా రాజకీయ ప్రస్థానం ఏ పార్టీతో మొదలైందో తిరిగి అక్కడికే వచ్చాను. ఏ పార్టీలో ఉన్నా నిజాయితీ, నిబద్ధత చాలా ముఖ్యం. ఏం చెప్పుతామో అదే చేయాలి. ఏ రంగంలో అయినా క్రమశిక్షణ చాలా ముఖ్యం. కాసుల బాలరాజు ఏ పనిచేసినా మడమ తిప్పడు. వారి పనితీరును గమనించిన రాష్ట్ర నాయకత్వం బాలరాజు గారికి రాష్ట్ర స్థాయి ఉన్నత పదవిని ఇవ్వబోతుంది. బాలరాజు గారికి రాష్ట్ర స్థాయి పదవి రావడం పట్ల మనమంతా సంతోషించాలి. తరువాత మనమందరం కలిసి వారిని ఘనంగా సన్మానిద్దామని తెలిపారు. TDP లో నేను కాసుల బాలరాజు ఇద్దరం కలిసి పనిచేశాం, ఇద్దరం అత్యంత సన్నిహితంగా ఉండేవారం. రాజకీయంగా విడిపోయినా మా ఇద్దరి మద్య వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు. రాజకీయాలలో విమర్శలు సహజం, కానీ వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం ఉండకూడదు. ఎప్పుడైనా లోకల్ లోకలే. బయట నుండి వచ్చిన వాళ్ళు అద్దెకు ఉండేవారు మాత్రమే. బాలరాజు కు కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తే వాళ్ళకు కడుపు నొప్పి ఎందుకు ? అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో గత ఇరవై ఏళ్ళుగా కాంగ్రెస్ జెండా మొసింది కాసుల బాలరాజు. అలాంటి వ్యక్తికి ఉన్నత పదవి వస్తే సంతోషించాలి తప్ప అడ్డం పడకూడదు. నాకు బయటకు ఒకటి, లోపల ఒకటి ఉండదు మొదటినుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులను, కార్యకర్తలను గౌరవించాలని మా వాళ్ళకు అందరికీ సూచించాను. ఇకనుండి పాత, కొత్త అని తేడా లేకుండా అందరం ఒక్కతాటిపై కలిసి నడవాలి. అందరం కలిసి భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలలో విజయం సాదిద్దాం. రేవంత్ రెడ్డిని  కలిసినప్పుడు నియోజకవర్గ సమస్యలపై వివరించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. నాకు ఎలాంటి ఆశలు లేవు, నియోజకవర్గ అభివృద్ధే నా ఆశయం. అని తెలిపారు. పోచారం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అభిప్రాయం అడిగారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నది. పోచారం గారు వస్తే అత్యంత బలంగా మారుతుందని చెప్పాను. పోచారం శీనన్న వస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, గతంలో కూడా నేను శీనన్నతో కలిసి పనిచేసాను, ఇప్పుడు కూడా కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తానని చెప్పాను. పోచారం శీనన్నతో, ఆయన కొడుకు తోను కలిసి పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను. నాకు పార్టీ ముఖ్యం. కొంతమంది దుష్ట శక్తుల నుండి పార్టీని కాపాడుకోవాలంటే పోచారం గారు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన అవసరం ఉన్నది అని కాసుల పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోచారం నాయకత్వంలో పని చేస్తానని వారు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.