ఆత్మహత్యకు యత్నించిన కాసుల బాలరాజ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాసుల బాలరాజు బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీని బతికించడానికి తీవ్రంగా తాను కృషి చేసినప్పటికీ అధిష్టానం మాత్రం తనను కాదని స్థానికేతరుడైన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి కేటాయించారని తన స్వగృహంలో బుధవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం అందరికి తెలిసిందే. పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డ తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కాసుల బాలరాజు క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన అనుచరులు, నాయకులు, కార్యకర్తలు హుటాహుటిన ఆయనను బాన్సువాడ ఏరియా హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక నాయకులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు.

Leave A Reply

Your email address will not be published.