మద్యం వ్యాపారంలో పాత్రధారి, సూత్రధారి కవిత

- బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… మద్యం వ్యాపారంలో పాత్రధారిసూత్రధారి కవిత అని అన్నారు. లిక్కర్ స్కాం లో అరెస్టు అయితే సింపతీ కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించని కవిత మహిళా హక్కుల కోసం పోరాడుతుందట అంటూ యెద్దేవా చేశారు. మహిళా గవర్నర్‌ పై నీచమైన పరుషపదజాలం వాడుతున్నా పట్టించుకోని కవిత  ఢిల్లీలో ధర్నా చేస్తుందట అని అన్నారు. కవిత ఓ మహిళా ద్రోహి అని… మహిళల ఉసురు తగులుతుందని బీజేపీ నేత శాపనార్ధాలు పెట్టారు.కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఏడడుగులు వేసి.. గవర్నర్‌కు అనుమానాలు నివృత్తి చేస్తే బిల్లులు ఓకే అవుతాయన్నారు. అయితే రాజకీయాల కోసమే ప్రభుత్వం  సుప్రీంకోర్టు కు వెళ్లిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్నీటి బిల్లులు పెంచిందని వాడటం మానేస్తారా బీఆర్ఎస్ నేతలు అని ప్రశ్నించారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి తన నిరసన చెబుతారన్నారు. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. గ్యాస్ ధరల పెంపు ఆయిల్ కంపెనీలు పెంచుతాయని… అయినా ధరలు పెరగకుండా చూడమని మోదీ ఆర్థిక మంత్రికి సూచించారని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.