కవిత సరే..మరి ఆదానీ,అంబానీ ల దొంగ కంపెనీలకతేంది ?

- పబ్బతి శ్రీకృష్ణ మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు విమర్శ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత దేశంలో ప్రపంచీకరణ విధానాల వల్ల ఎవరైనా ఎలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు . అందులో బాగంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్ ఎల్.సి  మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత వైన్ వ్యాపారంలో భాగస్వామ్యం ఉండొచ్చు.అందువల్ల ఆమె ఏదైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే శిక్ష ఉంటదనీ తనకూ తెలెసు అందుకే ఆమే సిబిఐ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి అధికారుల వద్ద అన్ని విషయాలు వెల్లడించింది.కానీ దేశంలో ఎక్కడ కూడ ఒక్క కంపెనీ పెట్టకుండా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న గుజరాత్ వ్యాపారులను ఎందుకు సిబిఐ విచారణ చేపట్టడంలేదు? ఎందువల్ల ప్రతిపక్ష నేతల మీద మాత్రమే ఈ రకమైన భయంకరమైన దాడులు చేస్తున్నారో సిబిఐ అధికారులు,బిజెపి.ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది.తమయొక్క పార్టీలో చేరిన తర్వాత దొంగలు మొత్తం ఏవిధంగా నీతిమంతులు అయ్యారో బిజెపి చెప్పాలని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ మాల డిమాండ్ చేసారు.ఆలాగే మహిళా బిల్లు ఆమోదం కోసం కవిత చేస్తున్న దీక్షకు మాల మహనాడు సంపూర్ణ మద్దతు ఇస్తున్నది.హైదరాబాద్ నగరంలో స్లీపింగ్ గ్యాంగ్ ఉండటం వల్లనే  మున్సిపాలిటి లో నకలీ బర్త్ సర్టిఫికెట్లు పెరిగిపోతున్నాయనీ బిజెపి నేతలు బండి సంజయ్, బజరంగ్ దల్ నాయకులు సింగ్ మాట్లాడుతున్న తీరు అత్యంత జుగుప్సాకరమైన విషయం.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇంటలీజెన్స్ అధికారుల పర్యవేక్షణను కూడ అవమానించేలా మాట్లాడుతున్న విధానాన్ని పబ్బతి శ్రీకృష్ణ మాల ఖండించారు.

Leave A Reply

Your email address will not be published.