కవిత సీబీఐ విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలి

- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తాజాగా నారాయణ మరో సంచలనం రేపారు. దిల్లీ మద్యం కేసులో విచారించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు సైతం విచారణను ప్రత్యక్షంగా చూపిస్తుంటే.. సీబీఐ ఆ పక్రియను ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించారు. మరోవైపు  ఈ కేసులో విచారించేందుకు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు రెండు బృందాలుగా వచ్చారు. అయితే కేవలం సాక్షిగా మాత్రమే కవిత వివరణను నమోదు చేయనున్నారు.రాజకీయాల్లో వామ పక్షాలది ప్రత్యేక దారి. అధికారం దగ్గరికి వచ్చినా అర్రులు చాచరు.. ప్రధాని పదవి అయినా సరే ఇష్టం లేకుంటే వద్దంటారు.. అవసరమైతే పొత్తు పెట్టుకుంటారు.. వీలు కాకుంటే దూరంగా వెళ్లిపోతారు. అదేమంటే.. ప్రజా సమస్యలు వినిపిచేందుకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కావాలంటారు. ఇతర రాజకీయ పార్టీలను బూర్జువా పార్టీలుగా విమర్శిస్తారు. అవినీతి అక్రమాలపై అలుపెరగకుండా పోరాడుతూనే.. వారి నుంచే పార్టీని నడిపించేందుకు చందాలు అడుగుతారు. ఇక అలాంటి పార్టీల్లో కె.నారాయణలాంటి నాయకుడు ఉంటే చెప్పాల్సిన పనిలేదు.

Leave A Reply

Your email address will not be published.