ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు

- గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ ఓటమి ఖాయం - అవినీతిలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ కు దోస్తీ - తన అవినీతి ఎక్కడ బయట పడుతుందో అన్న భయంతోనే.. సిట్టింగులకు తిరిగి మళ్లీ కేసీఆర్ అవకాశం కల్పించారు - బీఆర్ఎస్ తొలి జాబితాలో మహిళలకు ఎందుకు అత్యధిక సీట్లు కేటాయించలేదు? - మొదటినుంచి మహిళా వ్యతిరేకి కేసీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని  BJP రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణీ రుద్రమ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆమె మాట్లాడుతూ BRS నుంచి పోటీ చేయబోయే MLA అభ్యర్థుల లిస్ట్ చూసాక తెలంగాణ రాష్ట్ర BRS పార్టీ MLC కవిత , తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి. కేవలం లిక్కర్ స్కాం నుంచి దేశ ప్రజలను పక్క దారి పట్టించేందుకే కవిత మహిళా రిజర్వేషన్ డ్రామా అనేది ఈ లిస్ట్ తో రుజువైంది. 119 స్థానాల్లో 7 గురు మహిళలకు టికెట్ లు ఇచ్చిన మీకు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడే అర్హత లేదన్నారు.

జనాభా లో 50% ఉన్న మహిళలకు BRS పార్టీ 3% టికెట్ లు ఇస్తూ , దేశ వ్యాప్తoగా పార్టీ కమిటీ లల్లో మహిళలకు 30% రిజర్వేషన్ ఇస్తున్న BJP మీద వీళ్ళు పోరాటం చేస్తాననడం సిగ్గుచేటు. మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీ రోడ్ ల మీద ధర్నాలు చేసిన కవిత ప్రగతి భవన్ ముంగట ఎందుకు ధర్నా లు చేయలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ను మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది NDA ప్రభుత్వమే. వరుసగా 4 సార్లు ప్రవేశ్ పెట్టింది BJP నే. త్వరలో బిల్లు తీసువచ్చేది BJP ప్రభుత్వమే  అని తెలిపారు.

పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చింపి పారేసిన పార్టీ లతో అంట కాగుతు , సొంత పార్టీ లో ఏ ఒక్క కమిటీ లో మహిళల కు స్థానం ఇవ్వని BRS పార్టీ కథ MLC కవిత దొంగ దీక్ష తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఉరికి ఉరికి కవిత ధర్నా ల కూర్చున్న నాయకులంతా పట్టుమని పది మంది మహిళలకు మీ సొంత పార్టీ టికెట్ లు ఇయ్యకుంటే ఎందుకు మాట్లాడుతలేరని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.