కేసీఆర్ కుమహారాష్ట్ర వంజర్ల మద్దతు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వంజరి కులస్తుల ఆత్మగౌరవ భవనానికి ఉప్పల్ బగాయత్తులో కేటాయించిన ఎకరం స్థలం కోటి రూపాయల నిధులను పెంచి రెండు ఎకరాల స్థలము 5 కోట్ల రూపాయలు కేటాయించాలని అఖిలభారత వంజరి సేవా సంఘంసీనియర్ జాతీయ ఉపాధ్యక్షులు సాల్వేర్ కృష్ణ  తెలంగాణ  రాష్ట్ర వంజరి సంఘం మాజీ అధ్యక్షులు కాలేరు విశ్వనాథం తెలంగాణ వంజరి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎదుగని శంకర్ నారాయణ ,ప్రధాన కార్యదర్శి  దాత్రిక ధర్మరాజు,   సురేష్ కాలేరు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం లభించిన  70ఏండ్ల వరకువంజరి కులస్తులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరైన గుర్తింపు రాలేదని కేసీఆర్ గారి నాయకత్వంలోనే వంజరి కులస్తులకు గుర్తింపు లభించిందని వారు అన్నారు .వంజరి కులస్తునికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా ఉప్పల్ బాగాయతులో ఎకరం స్థలము నిధులు కేటాయించినందుకు కేసిఆర్ కు తాము కృతజ్ఞతలై  ఉంటామని వారు అన్నారు.వంజరి కులస్తుల పట్ల కెసిఆర్ ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి పట్ల  మహారాష్ట్ర వంజరులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకు వస్తున్నారని వారు వివరించారు.మహారాష్ట్రలో దాదాపు 25 నియోజకవర్గాల్లోతెలంగాణ రాష్ట్రంలో 15 నియోజకవర్గాల్లో బలమైన పట్టు ఉన్న వంజరి కులస్తులు బిఆర్ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని వారు తెలిపారు. మహారాష్ట్రలో  నివసిస్తున్న వంజరి కులస్తులు కేసీఆర్ విధానాల పట్ల ఆకర్షితులై ఆయనకు మద్దతుతెలుపుతున్నారని అఖిలభారత వంజరి సేవా సంఘం తరఫున తాము కూడా కేసీఆర్ బలపరచడానికి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయబోతున్నామని వారు తెలిపారు.మహారాష్ట్ర నుంచి అనేకమంది వంజరి కులస్తులు వ్యాపారం వాణిజ్యం ఉద్యోగ వ్యవహారాల తో ప్రతినిత్యం హైదరాబాద్  వచ్చి పోతుంటారని వారందరికీ వసతి సౌకర్యాలు కల్పించడమే కాకుండా జాతీయస్థాయిలో వంజరి కులస్తులకు సరిపడా వసతి గృహం నిర్మించడానికి మరియు పేద కులస్తులకు మ్యారేజ్ హాల్ నిర్మించడానికి ఎకరం స్థలం కోటి రూపాయల నిధులు సరిపోవని వాటిని పెంచి రెండు ఎకరాలు ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు విజ్ఞప్తి చేశారు.

బోగస్ ట్రస్ట్ కు కేటాయింపులు వద్దు

ఉప్పల్ ఆత్మగౌరవ భవన సముదాయం పేరిట కొందరు వ్యక్తులు కలిసి ఒక బోగస్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి  తమకే ఆత్మగౌరవ భవనం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరడం బాధాకరమైన విషయమని, రాష్ట్రంలో ఉన్న అన్ని రిజిస్టర్ సంఘాలను కలిపి తద్వారా ఏర్పడిన ట్రస్ట్ కు మాత్రమే కేటాయింపులు ఉండాలని అప్పటివరకు తుది కేటాయింపులు జరగరాదని వారు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.వంజరి కుల ఆత్మగౌరవభవనానికి వంజరి కుల గురువు ,లోక్ సంత్ భగవాన్ బాబా పేరు నామకరం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.లోక్ సంతు భగవాన్ బాబా పుణ్యతిధిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని వంజరి కులస్తులకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని వారు కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.వంజరులు కోల్పోయిన ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ పై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని వారు విన్నవించారు.

Leave A Reply

Your email address will not be published.