కేసీఆర్ న్యూ స్కెచ్..ఒకే దెబ్బకు రెండు పిట్టలు..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజకీయ స్కెచ్ లు వేయడంలో కేసీఆర్ దిట్ట. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా  తనకు అనుకూలంగా మార్చుకోవడంలో గులాబీ నేత సక్సెస్ అవుతారు. ఈ ఎక్విప్మెంట్ తోనే ఆయన నేషనల్ పాలిటిక్స్ లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు కొన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కానీ ఆ విషయాన్ని కేసీఆర్ ముందే గ్రహించారు. వాటినుంచి తప్పించుకోవడానికి న్యూ స్కెచ్ వేశారు. తాజాగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు మైనస్ కానుందనే సంకేతాలు కనిపించాయి. ఓ వైపు పార్టీలోని అంతర్గత విభేదాలు.. మరోవైపు టీడీపీ బహిరంగ సభ నిర్వహణతో బీఆర్ఎస్ ను ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం ఉందని అనుకున్నారు.  దీంతో వెంటనే అక్కడ తొలి బీఆర్ఎస్ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో బీఆర్ఎస్ లో ఏర్పడిన సమస్యను తొలగించే ప్రయత్నం చేయనున్నారు.తెలంగాణలో  జిల్లాల విభజన తరువాత కొత్త జిల్లాల్లోకలెక్టర్ కార్యాలయాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈనెల 12న భద్రాద్రి మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించనున్నారు. ఆ తరువాత ఖమ్మం వేదికగా బహిరంగా సభను నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తరువాత ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అక్కడే బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కానీ తాజాగా ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభను నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.గతం కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో అసంతృప్త జ్వాలలు బయటపడ్డాయి. ఈ పార్టీ తరుపున ఉన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు తుమ్మల అడుగులపై అనుమానాలు వ్యక్తమవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఈ జిల్లాకు ఒకే సీటును కేటాయించే అవకాశం ఉంది. అందువల్ల అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించే ఆస్కారం ఉంది. అందుకోసం నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు.మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఖమ్మం వేదికగా బహిరంగ సభను నిర్వహించారు. తెలంగాణలో టీడీపీ ప్రాబల్యం ఇంకా తగ్గలేదన్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పాత రోజులను గుర్తు చేసుకొని కొందరు నాయకులు టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. టీడీపీకి అవకాశం ఇవ్వకుండా ఆ జిల్లాను కాపాడుకోవాలని నిర్ణయించింది.ఇందులో భాగంగా ఖమ్మంలో తొలి బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహిస్తే ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినట్లవుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. మరోవైపు పొంగులేటి తుమ్మల మధ్య ఉన్న విభేదాలపై ఈ సభలో క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తానికి కేసీఆర్ తన కాళ్ల కిందకు నీళ్లు రాకముందే అప్రమత్తమయ్యారు. ఒకే దెబ్బతో రెండు సమస్యలు పరిస్కరించడానికి పెద్ద స్కెచ్ వేశారని తెలంగాణలో చర్చించుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.