కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్..

.. రంగంలోకి దిగిన పీకే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో బీజేపీని నామరూపాలు లేకుండా చేసే మరో అరుదైన అవకాశం కేసీఆర్‌కు వచ్చింది. నలుగురు కాదు నలభై మంది టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు టచ్‌లో తమతో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా బాహాటంగా బీజేపీ చెప్తూ వస్తోంది. ఇలాంటి వేల ముగ్గురు బీజేపీ సన్నిహితులు.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్యెల్యేలతో జరిపిన బేరసారాలని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. డీల్ కోసం వచ్చిన ముగ్గురినీ విచారిస్తున్నారు. సుమారుగా ఒక గంట వీడియోని రహస్యంగా పోలీసులు చిత్రీకరించారని సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ డీల్ నెరిపిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన రేగా కాంతారావు సోషల్ మీడియాలో పెట్టిన చిన్న పోస్ట్ కలకలం రేపుతోంది. ‘ఈ రోజు పెద్దసార్ ప్రెస్ మీట్’ అని ఆయన వెల్లడించారు.

ఎందుకింత జాప్యం..

డీల్‌కు పక్కా సాక్ష్యాలున్నట్లు భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పెద్ద వ్యూహంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ ‘కొనుగోలు బేరం’ సాక్ష్యాలను ఆయన ప్రెస్ మీట్‌లో బహిర్గతం చేస్తారని భావించినా అది జరగలేదు. దీంతో బీజేపీ విషయంలో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అదిగో ఇదిగో అన్న ప్రెస్ మీట్ ఎందుకు రద్దయింది? అనే అనుమానాలు తలెత్తున్నాయి. అయితే ఇది రద్దయిందా, లేక ఢిల్లీకి షిఫ్ట్ అయ్యిందా అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే కేసీఆర్ వ్యూహాలు వేరే ఉన్నాయట. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తున్న తరుణంలో దొరికిన ఈ డీల్ ఆధారాలను జాతీయ స్థాయిలో బయటపెట్టి, బీజేపీని జాతీయస్థాయిలో దెబ్బ తీసే అరుదైన అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టడంకంటే ఢిల్లీలో పెడితే ఆశించినంత పొలిటికల్ మైలేజీ వస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిందట. దీనికి కేసీఆర్ తొలుత ఒప్పుకోకపోయినా తర్వాత మాత్రం ఆ వాదన వైపే మొగ్గినట్లుగా సమాచారం. దీన్ని మునుగోడు, తెలంగాణ పంచాయితీగానే చూడొద్దని.. దేశంలో ఏ సీఎం కూడా చేయని ఆపరేషన్‌ను అత్యంత ధైర్యసాహసాలతో మీరు చేశారని.. ప్రపంచానికి మోదీ మోసం తెలియాలని కేసీఆర్‌కు పీకే సలహా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే హైదరాబాద్ ప్రెస్ మీట్ రద్దయిందని, ఒకటి రెండు రోజుల్లో అన్నిజాతీయ మీడియా ఛానెళ్లతో పాటు ఇంగ్లీష్ చానళ్లను కూడా రప్పించిఢిల్లీలో కేసీఆర్ భారీ ప్రెస్ మీట్ ఉండనున్నట్టు సమాచారం.

 

Leave A Reply

Your email address will not be published.