కేసీఆర్ చేనేత రంగానికి అండగా నిలిచారు

- ఎమ్మెల్సీ ఎల్. రమణ

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 18 వేల మగ్గాలను గుర్తించి చేనేత రంగానికి అండగా నిలిచారని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 18 వేల మగ్గాలను గుర్తించి చేనేత రంగానికి అండగా నిలిచారు కరోనా సమయంలో చేనేత కార్మికులకు దాదాపు వంద కోట్లు నిధులు ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మహారాష్ట్ర అధికారులు వచ్చి తెలుసుకున్నారు, మోడీ పీఎం అయ్యాక చేనేతపై 10 శాతం జిఎస్టీ విధించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్ళీ చేనేతపై 5 శాతానికి తగ్గించారన్నారు. చేనేతపై కేంద్రం జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానం చేశాము వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ పార్లమెంట్ లో సంతకాల సేకరణ చేపట్టింది. మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే అభివృద్ధి అనుకుంటోంది. మోడీ తీసుకువచ్చిన మేకిన్ ఇండియా ఏమైంది అని ప్రశ్నించారు. కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ కు కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వడం లేదు నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశం అప్పుల కుప్పగా మారిందని ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your email address will not be published.