వాకర్‌ సాయంతో మెల్లగా అడుగులు వేసిన కేసీఆర్‌

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స  విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్‌ సాయంతో బీఆర్‌ఎస్‌ అధినేత మెల్లగా అడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌ త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని కాంక్షిస్తున్నారు.శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ ఆరోగ్యం మెరుగుపడిందని యశోద వైద్యులు తెలిపారు. త్వరితగతిన కోలుకునేందుకు అనుకూలంగా కేసీఆర్‌ శరీరం సహకరిస్తోందని చెప్పారు. మానసికంగా కూడా కేసీఆర్‌ దృఢంగా ఉన్నారన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.