మరో రెండు రోజుల్లోనే కేసీఆర్ మరో మీటింగ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్  (Cm Kcr) దిట్ట. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా..చాకచక్యంగా వ్యవహరించి తన నిర్ణయాలతో ప్రతిపక్షాలను బోల్తా కొట్టించగల సమర్ధుడు కేసీఆర్ (Cm Kcr). ఇక తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్ కు పోటీగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఉన్నాయి. అయితే ఈ రేసులో కాంగ్రెస్ ఎక్కడో వెనకపడ్డట్టు అనిపించింది. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఒక్కసారిగా పరిస్థితులు హస్తం పార్టీకి సానూకూలంగా మారిపోయాయి. దీనితో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ అలెర్ట్ అయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే 20 రోజుల వ్యవధిలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ రేపు రెండోసారి బీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈసారి ముందస్తు ఉండదని..షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలని గతంలో పలుమార్లు గులాబీ బాస్ స్పష్టం చేశారు. కానీ ఇంతలోనా మళ్లీ సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఈ సమావేశంలో కేసీఆర్  (Cm Kcr) ముందస్తుపై నిర్ణయం తీసుకుంటారా? లేక ముందస్తు జాగ్రత్త కోసమే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఎన్నికల్లోనూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు విజయాన్ని కట్టబెడతాయని కేసీఆర్  (Cm Kcr) ధీమాగా ఉన్నారు. కష్టపడుతున్నాం..వంద సీట్లలో గెలిపించాలని సోమవారం ఫాక్స్ కాన్ శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రజల్లో ప్రభుత్వంపై పాజిటివిటీ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న నాయకులు కర్నాటక ఎన్నికల ఫలితాలతో మాత్రం ఉలిక్కిపడ్డారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమైందని..ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్న భావనలో ఉన్న కేసీఆర్ (Cm Kcr)..ఇది బలపడక ముందే ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్నభావనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా రెండు పర్యాయాల్లో కూడా బీఆర్ఎస్ కి ప్రజలు పట్టం కట్టారు. గత ఎన్నికల్లో రైతుబంధు రూపంలో..వివిధ పథకాల ద్వారా డబ్బులిస్తున్నారని ఓటేసిన ప్రజలే..నేడు తన జేబులోంచి కాదు కదా…ప్రజల సొమ్మే కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ముందస్తుకు కాకుండా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించే అవకాశం రైతుబంధు, దళిత బంధు తరహాలో కేసీఆర్  (Cm Kcr) అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలున్నాయంటున్న పార్టీ శ్రేణులు ఎంతో ధీమాగా ఉన్నారు. అయితే వాటిపై చర్చించేందుకే ఈ సమావేశం అని మరికొందరు నాయకులు చెబుతున్నారు. అలాగే అక్కడక్కడ స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలపై పెల్లుబికుతున్న వ్యతిరేకతను కంట్రోల్ చేసేందుకు ఈ సమావేశాలు అని చర్చించుకుంటున్నారు. తెలంగాణ BJPలో అసంతృప్తి చిచ్చు.. బండి సంజయ్‌కి ఎర్త్ పెడుతున్నారా? తాజా పరిస్థితుల్లో బీఆర్ఎస్ దేశ వ్యాప్త కార్యక్రమాలపై పునరాలోచనలో పడింది. ఓ వైపు బీజేపీ ..మరో వైపు కర్నాటకలో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ నాయకులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా..లోలోన ఆందోళన చెందుతున్నారు.  అయితే ముందస్తు లేదు…ఏం లేదు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలపై చర్చించేందుకు మాత్రమే ఈ సమావేశం. రాష్ట్ర రాజధాని నగరంలోనే కాదు..నియోజక వర్గ స్థాయిలోనూ ఉత్సవాలు జరపాలనే అంశంపై దిశా నిర్ధేశం చేసేందుకు మాత్రమే ఈ సమావేశం” అని కేసీఆర్ టీంలో కీలక నాయకుడు న్యూస్ 18తో వ్యాఖ్యానించారు. “కర్నాటక ఎన్నికల ఫలితాలతో మాకేం సంబంధం..మేం ప్రచారానికి వెళ్లామా..ఫలితాలు ముందే ఊహించాం కాబట్టే జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం చేయలేదు. మా సార్ వెళ్లలేదు.” అని కూడా చెప్పారు. ఆంధ్రాలో ఉద్యోగం చేయడానికి లేని ఓపిక తెలంగాణలో ఎందుకుంది? ప్రస్తుత పరిస్థితుల అంచనా కోసమే మీటింగ్.. “ముందస్తుకు వెళ్లే అవకాశాలు తక్కువ..ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు కేంద్రంతో, గవర్నర్ తో కేసీఆర్ కు సఖ్యత లేదు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు కేసీఆర్ కు నష్టం. కర్నాటక ఎన్నికలు బీఆర్ఎస్ కూ చాలా పాఠాలు నేర్పాయి. ప్రత్యేకించి అవినీతి, నాయకుల దౌర్జన్యాలు ఇలా. కాబట్టి వాటిపై దృష్టి సారించి కేడర్ కు దిశా నిర్ధేశం చేసే అవకాశాలే ఎక్కువ ” అని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు వేణు గోపాల్ రెడ్డి న్యూస్ 18తో చెప్పారు

Leave A Reply

Your email address will not be published.