ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలాన్ని పొడిగిస్తూ.. కేంద్రంలోని డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. నీరభ్ కుమార్ సర్వీస్‌‌ను జులై 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎస్‌గా నీరభ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సర్వీస్‌ను పొడిగించాలని కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు.. లేఖ కూడా రాశారు. సీఎం చంద్రబాబు విజ్ఞ‌ప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నీరభ్ కుమార్ ప్రసాద్ మరో ఆరు నెలల పాటూ సీఎస్‌గా కొనసాగుతారు.మరోవైపు కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ఏపీ కేడర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పీయూష్‌కుమార్‌ కూడా ఏపీకి వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్ ఆయన్ను ఏపీకి పంపించాలని విజ్ఞప్తిని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీయూష్ కుమార్ ప్రస్తుతం కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన్ను రాష్ట్రానికి తిరిగి పంపించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. పీయూష్‌ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందంటున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కావడంతో కీలక బాధ్యతలు అప్పగించే పనిలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.