ఖర్గే ఎఐసిసి అధ్యక్షుడు గా గెలవడం కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనం

.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఖర్గే ఎఐసిసి అధ్యక్షుడు గా గెలవడం కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనమై, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  వచ్చే ఎన్నికల్లో ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ గెలుస్తుంది, రాహుల్ గాంధీ భారత్ జోడో దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అన్నారు. రాహుల్ పాదయాత్ర చరిత్రలో నాభూతో న భవిష్యత్ ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ లో ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతుంది. రాష్ట్రంలో అనేక వర్గాల తో రాహుల్ కలుస్తారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు. 23 వ తేదీన రాహుల్ యాత్ర తెలంగాణలో ఎంటర్ అవుతుంది, 7 నవంబర్ వరకు తెలంగాణ లో రాహుల్ యాత్ర రాష్ట్రంలో రాహుల్ ను కలిసే వారిలో రాజకీయాలకు అతీతమైన వారు,మేధావులు ఉంటారు. రైతుల సమస్యలు,పొడుభూముల సమస్య,నిరుద్యోగ సమస్యలపై రాహుల్ అడ్రస్ చేస్తారు అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్య రెట్టింపు అయ్యింది. దేశ హితం కోసం రాహుల్ చేపట్టిన యాత్ర లో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.