కృష్ణంరాజు సూక్తి ముక్తికాలు స్ఫూర్తిదాయకం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సమాజంలోని పరిస్థితులను అవగాహన చేసుకుని అనుభవ పూర్వకమైన మంచి మంచి సూక్తి ముక్తికాలుగా అందించిన దంతులూరి కృష్ణంరాజు కృషి నిత్య ఆచరణీయమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత దంతులూరి కృష్ణంరాజు రచించిన సూక్తి ముక్తకాలు గ్రంథావిస్కరణ సభ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రమణాచారి సూక్తి ముక్తకాలు గ్రంధాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. పిల్లలు విదేశాలలో చదివి సంపాదించి అక్కడే స్థిరపడకుండా మాతృదేశానికి తల్లిదండ్రులకు సేవ చేయడం అదే ఉత్తమ సంస్కారం అని రమణ చారి అన్నారు సంస్కారవంతమైన హితోక్తులు అందించిన రచయిత అభినందనీయుడు అన్నారు. డాక్టర్ టి గౌరవ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ పివి మనోహర్రావు, డాక్టర్ బి విజయ రాములు, సిని సంగీత దర్శక గాయకులు నిహాల్, దైవజ్ఞశర్మ, పివివి రామావతారం కృష్ణంరాజు మానస సంస్థ కార్యదర్శి రఘు శ్రీ, అధ్యక్షులు బండారుపల్లి రామచంద్ర రావు, వర్మ, గందె సోమశేఖర్, డాక్టర్ లలితవాణి తదితరులు ప్రసంగించారు. అనంతరం కృష్ణంరాజు దంపతులను అతిథులు ఘనంగా సత్కరించారు గ్రంధకర్త తన పుస్తకాన్ని డాక్టర్ ఉమర్ అలీషా కి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమానికి ముందు గాయకుడు నిహాల్ పాటలు కందుల ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు సభికులను ఎంతో అలరించాయి

Leave A Reply

Your email address will not be published.