రైతుబంధు’ కు నిధుల కొరత

-  11 ఎకరాలలోపు వారికి మాత్రమే జమ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ కు గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఓట్లు కురిపించిన పథకం ఏదైనా ఉందంటే అది రైతుబంధు’ అని చెప్పొచ్చు. అలాంటి అద్భుత పథకానికి ఇప్పుడు నిధుల కొరత వెంటాడుతోంది. అందుకే రైతుబంధు డబ్బుల పంపిణీలో భూస్వాములకు కోత విధిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 11 ఎకరాలలోపు వారికి మాత్రమే జమ చేయనున్నట్టు ప్రకటించాడు.రబీ‘ సీజన్ కు సంబంధించిన రైతు బంధు సాయం రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. 11 ఎకరాల కన్నా ఎక్కువున్న వారి ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదు. అసలు సాయం అందుతుందో లేదోనన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొంది.అయితే 11 ఎకరాలు ఉంటే భూస్వాములే అని.. వారికి రైతు బంధు అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. మోడీ సర్కార్ కేవలం ఎకరాల లోపు వారికి మాత్రమే వేస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా 11 ఎకరాల లోపు వారికి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.ప్రతీసారి రైతు బంధు పడి ఈసారి బూస్వాములకు పడకపోవడంతో ఆఫీసర్లకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నట్టు తెలిసింది.అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వద్ద నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టేసింది. సాంకేతిక సమస్యలంటూ కాలయాపన చేస్తోంది. దీంతో వస్తాయో రావేమోనని అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులను రైతులు నిలదీస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.