జూలై 13వ తేదీన చంద్ర‌యాణ్‌-3ని ప్ర‌యోగం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చంద్ర‌యాణ్‌-3మిష‌న్‌ను ఈనెల 13వ తేదీన ప్ర‌యోగించ‌నున్నారు. ఇస్రో చీఫ్ ఎస్ సోమ‌నాథ్ ఇవాళ ఆ విష‌యాన్ని తెలిపారు. జూలై 13వ తేదీన చంద్ర‌యాణ్‌-3ని ప్ర‌యోగించాల‌నుకుంటున్నామ‌ని, అయితే జూలై 19వ తేదీ వ‌ర‌కు తేదీని పొడిగించే అవ‌కాశం ఉంద‌న్నారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. జీఎస్ఎల్వీ మార్క్‌-3 రాకెట్ ద్వారా చంద్ర‌యాణ్‌-3ని పంప‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా, ర‌ష్యా, చైనా దేశాలు మాత్ర‌మే స్పేస్‌క్రాఫ్ట్‌ను మూన్ స‌ర్ఫేస్‌పై దించాయి. అయితే ఆ మైలురాయిని అందుకోనున్న నాలుగవ దేశంగా ఇండియా మార‌నున్న‌ది.చంద్రుడిపై ఉన్న చీకటి ప్ర‌దేశంలో చంద్ర‌యాణ్‌-3 రోవ‌ర్ ల్యాండ్ అవుతుంది. 14 రోజుల పాటు ప‌నిచేసే విధంగా మూన్ మిష‌న్‌ను డిజైన్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.