న్యాయమూర్తులపై న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు న్యాయమూర్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు తమ తమ ఉద్యోగాలను వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొలీజియం ద్వారా జరుగుతున్న జడ్జిల నియామక ప్రక్రియలో మార్పులు రావాలన్నారు.  అహ్మదాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ మ్యాగజైన్‌ పాంచజన్య నిర్వహించిన సాబర్మతి సంవాద్‌’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ కిరణ్‌ రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను తక్కువ చేసి మాట్లాడటం పట్ల న్యాయమూర్తులతోపాటు న్యాయవాదులుకోర్టుల సిబ్బంది తీవ్రంగా నిరసిస్తున్నారు.న్యాయవ్యవస్థ కార్యకలాపాలు పారదర్శకంగా లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. అక్కడ చాలా రాజకీయం జరుగుతున్నదనిఈ రాజకీయం బయటికి కనిపించదుఅయితే ఇక్కడ అనేక విభేదాలుఫ్యాక్షనిజం కూడా కనిపిస్తున్నదని ఆరోపించారు. న్యాయమూర్తులు న్యాయం చేయడానికి బదులు కార్యనిర్వాహకులుగా వ్యవహరించాలని చూస్తే తాము మొత్తం వ్యవస్థనే పునఃపరిశీలించాల్సి ఉంటుందని రిజిజు  హెచ్చరించారు . సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో రాజకీయాలకు తావులేదన్న రిజిజు.. దేశంలో న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదనికేవలం మన వద్దనే ఆచరణలో ఉన్నదని చెప్పారు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు.భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులను నియమించడం కేంద్ర ప్రభుత్వం పని అనిఅయితే 1998లో సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ప్రారంభించిందని కేంద్ర మంత్రి రిజిజు చెప్పారు. దీని ద్వారా జడ్జీలను జడ్జీలే భర్తీ చేస్తున్నారన్నారు. ఎక్కువ మంది న్యాయమూర్తులు తమ ప్రధాన విధులను వదిలేసి సగం కంటే ఎక్కువ సమయం ఇతర న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం గమనించానని పేర్కొన్నారు. ఇది న్యాయం అందించడం అనే వారి పనిపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అందుకే ఈ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.