మృగ్యమైన కనీస మానవీయ విలువలకు అద్దంపట్టిన నేతలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సందర్భం అలాంటిది! ఏం చేస్తాం!! అనుకుంటూ వైసీపీ నాయకుడు ఎంపీ వి. విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ కూడా పక్క పక్కనే కూర్చుని కన్నీరు పెట్టుకున్నారు. నిజానికి రాజకీయంగా వైరి వర్గంగానే కాకుండా.. అంతకుమించి అన్న విధంగా సాయిరెడ్డి.. చంద్రబాబు.. ఇద్దరూ తీవ్ర విమర్శలు గుప్పించుకోవడం తెలిసిందే. ఒకరిపై ఒకరు సటైర్లు.. కేసుల ప్రస్తావన.. ఇతరత్రా విమర్శలకు హద్దే లేదు.అయితే.. వాస్తవానికి కుటుంబాల పరంగా.. ఒకరు కమ్మ మరొకరు రెడ్డి అయినప్పటికీ.. బాంధవ్యం ఉంది. చంద్రబాబుకు బావమరిది కుమారుడు అంటే.. మేనల్లుడు అయ్యే తారకరత్న మృతి చెందారు.ఇక ఇదే తారకరత్న.. వైసీపీ నేత విజయసాయిరెడ్డికి అల్లుడు వరుస అవుతారు. సాయిరెడ్డి మరదలు(భార్య చెల్లెలు) కూతూరు.. అంటే తోడల్లుడి కుమార్తె అలేఖ్యరెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈనేపథ్యంలో అటు నందమూరి కుటుంబానికి.. ఇటు సాయిరెడ్డి కుటుంబానికి మధ్య అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే తారకరత్న ఆసుపత్రిలో ఉన్న నాటి నుంచి కూడా సాయిరెడ్డి వెళ్లి పలకరించడం.. ఆయన కోలుకోవాలని దేవుళ్లను వేడుకోవడం.. ట్వీట్లు చేయడం తెలిసిందే. అంతేకాదు.. ఒక సందర్భంలో చంద్రబాబు తనకు అన్నయ్య వరుస అవుతాడని కూడా వ్యాఖ్యానించారు.ఇప్పుడు తారకరత్న మృతి చెందిన నేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు అటు బాబు ఇటు సాయిరెడ్డి ఇద్దరూ కూడా ఒకే సమయంలో వెళ్లారు.
కరడు గట్టిన రాజకీయ ద్వేషాన్ని పక్కన పెట్టి.. పక్కపక్కనే కూర్చుని యువ నటుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి.. కన్నీరు పెట్టుకున్నారు. నిజానికి ఇది బాధాకర పరిస్థితే అయినా.. నేటి ఏపీ రాజకీయాల్లో మృగ్యమైన కనీస మానవీయ విలువలకు అద్దంపట్టింది!!

Leave A Reply

Your email address will not be published.