బీసీలపై అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఇక కొనాసాగనివ్వం

- స్వయం పాలన దిశగా సాగుతాం.. - పరకాల గడ్డ బీసీలకు రాజ్యాధికారపు  అడ్డా – - బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు - దాసు సురేశ్ ,

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీలు అగ్రవర్గాలకు ఓట్లేసే కాలం చెల్లిందనీ  ఇకపై బీసీల ఆధిపత్య స్థానాల్లో బీసీలే అధికారాన్ని చేపట్టేలా క్షేత్ర స్థాయి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ పరకాలలో నిర్వహించిన బీసీల రాజ్యాధికార సదస్సులో పేర్కొన్నారు.. శనివారం పరకాల పట్టణంలో బీసీ రాజ్యాధికార సమితి పరకాల నియోజకవర్గ ఇన్చార్జి పొదిల రాజు నేతృత్వంలో నిర్వహించిన బీసీ ముఖ్య నాయకుల సమావేశానికి బీసీ నాయకులు, ప్రజాసంఘాల,ఉద్యమ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున విచ్చేశారు.. “పరకాల గడ్డ బీసీల రాజ్యాధికార అడ్డ” అని ముఖ్త ఖంఠంతో నినదించారు..తెలంగాణ రాష్ట్రంలో 72 అసెంబ్లీ స్థానాల్లో 60 శాతం బీసీలున్నా ఈ స్థానాల్లో సగానికి పైగా అగ్రవర్ణ పాలకులే రాజ్యమేలుతూ బీసీల అవకాశాలను హరిస్తున్నారని దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు..ప్రభుత్వ , ప్రజల భూములను అమ్ముతూ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు.. వరదలతో నిండా మునిగిన పేద వర్గాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాల్లో వేల కొద్ది వాహనాలతో పర్యటించడం దేనికి నిదర్శనమన్నారు.58 శాతం జనాభా ఉన్న బీసీలు పరకాలలో ఎమ్మెల్యే స్థానంలో ఉండాల్సి ఉన్నా గడిచిన 75 సంవత్సరాలు నుండి కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే బీసీ నాయకత్వం అధికారంలో కొనసాగడం అగ్రకుల పార్టీల దాష్టీకానికి దర్పణం పడుతుందని దాసు సురేష్ తెలిపారు.బీసీలను దళితులను తెలివితక్కువ వారనీ , ఏ పనికీ పనికిరారంటూ అవమానించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రానున్న ఎన్నికల్లో బీసీ ల ఓట్లెలా అడుగుతారని నిలదీశారు..పరకాల ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డంపెట్టుకొని వేల కోట్ల కాంట్రాక్టులు పొందుతూ బీసీల,పేదల సమస్యలను అటకెక్కించారంటూ ఆరోపించారు..పరకాలనియోజక వర్గంలో ప్రభుత్వ భూములను కాజేయడమే కాక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ముసుగులో వందల ఎకరాల రైతుల భూములను  మింగేశారని దాసు సురేశ్ ఆరోపించారు.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి పనులను తన కుటుంభ సబ్యులకు కేటాయించుకొని రైతుల నోళ్ళలో ధర్మారెడ్డి మట్టికొట్టారన్నారు.. మా ఓట్లతో మా పైనే ఆధిపత్యం చెలాయించే అగ్రకుల ఆధిపత్యానికి చరమ గీతం పాడుతూ బీసీనే పరకాల ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు..ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మంత్రి కాశయ్య స్థానిక బీసీ నాయకులు లక్క సురేశ్ ముదిరాజ్, సర్వ రజన్న, పడిపాల వెంకన్న శాలివాహన, గడ్డం సర్వేషాం పద్మశాలి, దుంపెటి నాగరాజు పద్మశాలి, బండ సాంబయ్య , వాల్మీకి బోయ, వలిపిడి సుధీర్ మేదరి బాణాల వెంకటేష్,p కిషన్ రావు అరే, నేరెళ్ల రంజిత్ రజక,m శ్రీధర్ మేర, తూముల రఘువీర్ నయీని బ్రమ్మ తదితరులు పాల్గొన్నారు ..

Leave A Reply

Your email address will not be published.