డాక్టర్స్ మాదిరిగా లాయర్లకు కుడా రక్షణ చట్టం తీసుక రావాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సామాజిక న్యాయసాధనకై తెలంగాణా బిసి న్యాయవాదుల సంఘం  ఈనెల 30న జరుప తలపెట్టిన న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణా బిసి న్యాయవాదుల సంఘం  అద్యక్షులు నాగుల శ్రీనివాస్,ప్రదాన కార్యదర్శి బత్తుల కృష్ణ లు విజ్ఞప్తి చేసారు. సోమవారం బిసి భవన్ లో ఏర్పత్రుచేసిన మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10గంటల నుంచి 2 గంటల వరకు జరిగే ఈ మహాసభ కు ముఖ్య అతిధులుగా జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ ఈ.వి.వీనుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్ , తెలంగాణా అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్,రాజ్యసభ సబ్యులు ఆర్.కృష్ణయ్య లు హాజరవుతున్నట్లు తెలిపారు.  హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియమకాలలో బిసి/ఎస్సి/ఎస్టి లకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కోటా ప్రవేశపెట్టాలని, అలాగే జూనియర్ బిసి అడ్వకేట్ కు  నెలకు 20 వేల స్టైఫండ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి అడ్వకేట్ కు 250 గజాల ప్రభుత్వ స్థలం, ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అడ్వకేట్స్ అందరికీ, కుటుంబ సభ్యులతో ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని కోరారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రము లో న్యాయవాదుల పై దాడులు,హత్యలు  పెరిగి పోతున్నయని ఆందోళన వ్యక్తం చేసారు.బయట దాడులతో పాటి ఏకంగా కోర్ట్ ఆవరనలోనే లాయర్లపై దాడులు జరుగటం శోచనీయమన్నారు. డాక్టర్స్ మాదిరిగా లాయర్లకు కుడా రక్షణ చట్టం తీసుక రావాలని డిమాండ్ చేసారు. ఈ నెల 30న జరిగే మహా సభకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టులలో ప్రాక్టీస్ చేసె బిసి అడ్వకేట్స్ పాల్గొనాలని కృష్ణయ్య పిలుపు నిచ్చారు. అలాగే రాజ్యాంగము – సామాజిక న్యాయము – అనే అంశంపై చర్చ జరిపి తీర్మానాలు చేయడము జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అడ్వికెట్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్నప్తి చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.