ఆధార్‌ కార్డును ఈ-మెయిల్‌ ఐడీతో లింక్‌ చేయడం వల్ల అనేక లాబాలు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణగౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ డిమాండ్ చేసారు. సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంను సందర్శించిన సత్యనారాయణగౌడ్ విద్యార్థిని విద్యార్థుల యొక్క సమస్యలను తెలుసుకొని  అర్థం చేసుకొని అట్టి   సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతూ  విద్య అనేది  అందరికీ ఆభరణం లాంటిది మరియు  అనాది కాలం నుండి  చూసినా,  విద్యను అభ్యసించిన వారు అద్భుతమైన విజయాలు సాధించి అందరికీ ఆదర్శనీయంగా చరిత్రలో నిలిచారని అన్నారు. అందుకు ఉదాహరణగా  ఎందరెందరో మహానుభావులు ఉన్నారని, అందులో  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విద్య అనే ఆయుధంతో సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి  అహర్నిశలు కష్టపడి పేదరిక నిర్మూలనకు  విద్యనే సరైన ఆయుధమని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారని అన్నారు. అదేవిధంగా  అట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న అటువంటి విద్యను అభ్యసించడానికి అందరికీ అందుబాటులో ఉన్న  జిల్లా గ్రంథాలయాలను మెరుగైన సౌకర్యాలతో  మెరుగుపరిచి  నాణ్యతమైన భోజనాన్ని గ్రంథాలయ పాఠకులకు అందుబాటులో ఉంచాలని  సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి మరియు  జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మరియు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో  నేటి బాలలే భావిభారత పౌరులు అని నినాదాలు చెప్పే ఉన్నత ప్రభుత్వ అధికారులు , రాజకీయ నేతలు , మరియు సంఘ సంస్కర్తలు ప్రత్యేకమైన దృష్టి పెట్టి సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ పాఠకులకు  న్యాయం చేకూర్చాలని  విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క   కార్యక్రమంలో  సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.