అక్రమాలపై పంజా విసిరే “సింగం”

- పౌర సరఫరాల శాఖ కు వన్నె తెచ్చేలా మాచన రఘునందన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాచన రఘునందన్..ఇపుడు దేవర కొండ లో ఓ సెన్సేషన్ గా మారారు. ఎన్ఫోర్స్ మెంట్ ఆన్న పెరుకు సార్థకత చేకూరుస్తున్నారు ఈ అధికారి. అక్రమాల పై తన దైన శైలిలో ఉక్కు పాదం మోపుతున్నారు. తప్పు చేస్తున్న వారి తుప్పు వదలగొడుతున్నారు.ఎదో వచ్చాం..వెళ్ళాం ఆన్న చందాన వ్యవహరించే కొందరు అధికారులకు భిన్నంగా “మాచన” రియల్ ఆఫీసర్ గా ఓ ఉదాహరణ గా నిలుస్తున్నారు.తాజాగా దేవర కొండ బస్ డిపో లో చమురు సరఫరా ఉదంతం తో ..ఇలా కూడా జరుగుతుందా అని ఉలిక్కి పడేలా చేశారు మాచన రఘునందన్. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ గా గతేడాది భాధ్యత తీసుకున్న రఘునందన్ పౌర సరఫరాల శాఖ కు వన్నె తెచ్చే లా .. అధికారి అంటే ఇతనే రా..అని జనం భావించేలా విధి నిర్వహణ లో బుల్లెట్ లా దూసుకెళ్తున్నారు. సామాన్యుడి ఆయుధంగా,జన సామాన్యం లో పేరు తెచ్చుకున్నారు. అందిన కాడికి దండుకుందాం..దీపం వుండగానే ఇల్లు చక్క బెట్టుకుందాం అని భావించే కొందరు అధికారులకు మన “మాచన” కు ఎంతో తేడా.!

ప్రజా పంపిణీ వ్యవస్థ లో తేడా ల పై కొరడా ఝులిపించి మరీ.. భాధ్యతా రాహిత్యం గా ఉన్న రేషన్ డీలర్ల దుమ్ము దులుపుతున్నారు. దేవర కొండ బస్ డిపో లో ఇంధనం సరఫరా చేసిన వ్యవహారం లో గత మూడు నెలల్లో నే ముగ్గురిని మార్చడం పలు సందేహాలకు తావిచ్చెలా ఉండటం తో సోమవారం నాడు సమగ్రంగా విచారణ జరిపారు.నాగర్ కర్నూల్ కు చెందిన ఓ పెట్రో డీలర్ ఎంత తక్కువ కు డీజిల్ సరఫరా చేశారు. “ఉన్నత” స్థాయి పలుకుబడి తో వచ్చిన  సదరు సప్లై దారున్ని జనవరి మొదటి వారం లో నే ..”ఇక మీ ఇంధనం వద్దు” అని ఆపడం లో జరిగిందేమిటి .ఆన్న ప్రశ్నలకు సోమవారం జరిగిన తనిఖీ తో ఆసక్తి కరమైన అంశాలు బయటికి వచ్చాయి. తనిఖీ చేసిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారి రఘునందన్ గురించి కూడా.. ఎవరితను ఎక్కడినుంచి వచ్చాడు.అని కూడా ఆరా తీసినట్టు తెలిసింది.కొందరు రెవెన్యూ ఉద్యోగుల కు ఫోన్లు చేసి “మాచన రఘునందన్” ఎవరు . మా డిపో లో కి వచ్చి మరీ తనిఖీ చేశారు.అని వాకబు చేసినట్టు తెలిసింది. లోలోపల జరిగిన లోగుట్టు బయటకు ఎలా పొక్కింది ఆన్న విషయం పై డిపో లో తర్జన భర్జన లు పడ్డట్టు సమాచారం. డిపో లో తనిఖీ సంధర్భంగా నాగర్ కర్నూల్ నుంచి సరఫరా అయ్యిన ఇంధనం మూలంగా నే  అద్దె బస్సుల కు సాంకేతికంగా నష్టం జరిగినట్లు వెళ్లడి కావడం తో.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎంటి ఆన్న కోణం లో రఘునందన్ విచారణ జరిపారని తెలిసింది.సదరు చమురు డీలర్ నాణ్యతా, పరిమాణం లో కూడా ప్రమాణాలు పాటించక పోవడం వల్లే ..”ఇక చాలు” అని చెప్పి జనవరి రెండో వారం నుంచి పోలే పల్లి కి చెందిన డీలర్ కు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. చమురు కంపెనీలు డీలర్ కు లీటర్ పై 1.80 పైసల కమీషన్ ఇస్తారు. ఐతే దాదాపు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న డీలర్ తక్కువ ధరకు సరఫరా అవకాశo దక్కిచుకుంటే, నాణ్యత తక్కువ గా ఉంటుంద?! ఆన్న కోణం లో దేవరకొండ ఆర్టీసీ డిపో అంత గా ఆలోచించ లేక పొయింది అని తెలుస్తుంది. ఏది ఏమైనా రఘునందన్ తనిఖీ వల్ల అతి తక్కువ ధరకు ఇంధనం ఇవ్వగలిగే సామర్థ్యం సదరు డీలర్ కు ఎలా కుదిరింది ఆన్న కోణం లో ఆలోచించి సమగ్ర సమాచారం రాబట్టి నట్టు తెలిసింది. బస్సుల కు మైలేజి విషయంలో ఖచ్చితం గా వ్యవహరించే ఆర్టీసి నాణ్యత, పరిమాణం విషయం లో అనుమానం కలిగాకే సరఫరా కు బ్రేక్ వేయడం పలు సందేహాలకు తావిచ్చెలానే ఉందన్నది నిస్సందేహంగా “దాల్ మే కుచ్ కాలా” హై అని అనుమాన పడే లా నే ఉంది. మొత్తానికి ఎన్ఫోర్స్ మెంట్ అధికారి మాచన రఘునందన్ తనిఖీ తో అటు ఆర్టీసీ సిబ్బంది లో ఇటు ఇంధనం సరఫరా చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిన మాట వాస్తవం.

Leave A Reply

Your email address will not be published.