విశాఖ బీచ్‌లో హంగామా చేసిన చిరు ఫాన్స్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో  ఓ వైపు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది.. మరోవైపు మెగా ఫ్యాన్స్ చిరు పై తమ అభిమానాన్ని చాటుతూ సినిమా ప్రమోషన్ ను తమదైన శైలిలో చేస్తున్నారు. తాజాగా విశాఖ బీచ్‌లో వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్‌ వాక్‌ జరిగింది. వాల్తేరు వీరయ్య గెటప్‌లో సందడి చేశారు అమ్మాయిలు, అబ్బాయిలు. ఈ రోజు ట్రైలర్ ను రిలీజ్ చేయనుండగా.. రేపు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక బీచ్‌ నుంచి మరో ప్లేస్‌కి షిఫ్ట్‌ అయ్యింది.

మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్‌ జోరుగా సాగుతోంది. విశాఖ బీచ్‌ రోడ్‌లో ప్రమోషన్‌ ర్యాలీ నిర్వహించారు మెగా ఫ్యాన్స్‌. వాల్తేరు వీరయ్య గెటప్‌లో లుంగీ, షర్ట్‌, కళ్లద్దాలు ధరించి బీచ్‌ రోడ్‌లో వాక్‌ చేశారు అభిమానులు. అమ్మాయిలు, అబ్బాయిలతోపాటు చిన్నపిల్లలు కూడా వాల్తేరు వీరయ్య గెటప్‌లో ఆకట్టుకున్నారు. విశాఖ వేదికగా రేపే వాల్తేరు వీరయ్య మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతోంది. మెగా ఈవెంట్‌ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయ్‌. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు మెగా అభిమానులు. అయితే, బీచ్‌ రోడ్‌ నుంచి వేదికను మార్చుకోవాలని పోలీసులు సూచించడంతో, ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌కి షిఫ్ట్‌ చేశారు నిర్వాహకులు.దీంతో మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా నిర్ణయించినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 8న సాయంత్రం 5 గంటలకు విశాఖలోని ఆర్కే బీచ్‏లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరు రవితేజలు కలిపి నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

Leave A Reply

Your email address will not be published.