చెట్టు తొలగింపును అడ్డుకున్న స్థానికులు

- ఎన్విరాన్మెంట్....కౌన్సిల్ తో కలిసి జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  దిల్ సుఖ్ నగర్ శాంతినగర్ లో ఓ చెట్టు కొట్టే ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. విషయాన్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ గౌరవాధ్యక్షులు ఉప్పల వెంకటేష్ గుప్త, అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య తదితరుల దృష్టికి రావడంతో బుధవారం ఎల్ బి నగర్ జోనల్ కమీషనర్ కార్యాలయంలో కాలనీ వాసులతో కలిసి ఒక ఫిర్యాదు అందజేశారు. జోనల్ కమీషనర్ అందుబాటులో లేకపోవడంతో అర్బన్ ఫారెస్టు మేనేజర్ సత్యనారాయణను కలిసి సమస్య వివరించారు.స్థానిక వ్యాపారులు స్వార్ధంతో చెట్టు తొలగించే ప్రయత్నం సరికాదాన్నారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న మేడి చెట్టును వ్యాపారుల అవసరం కోసం ట్రాన్స్ లొకేషన్ చేయడం ఏంటని వెంకటేష్ గుప్త ఫారెస్టు మేనేజర్ సత్యనారాయణను నిలదీశారు. దీంతో అయన స్థానికుల ఆకాంక్ష మేరకు చెట్టు తొలగింపు ప్రయత్నాన్ని విరమించు కుంటామని, ఆమేరకు జోనల్ కమీషర్ ను కలవాల్సిందిగా సూచించారు. మేము పచ్చదనం పెంచడానికే ఉన్నామని, తుంచడానికి కాదని ఆయన పేర్కొన్నారు. కాగానే స్థానిక సంజయ్ స్టీల్ బజారు వ్యాపారులు అధికారుల నుంచి ట్రాన్స్ లొకేషన్ కోసం అనుమతి తెచ్చామని చెపుతున్నా బిల్డింగ్ యజమాని చెట్టు తొలగింపును వ్యతిరేకించడం గమనార్హం. అనంతరం వారు స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేష్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారు.ఈ కార్యక్రమంలో శాంతినగర్ కాలనీ అధ్యక్షులు రాజయ్య, స్థానికులు, పర్యావరణ ప్రేమికులు చిన్నారావు, శ్రీకాంత్, తిరుపతి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.