ప్రత్యామ్నాయ రాజకీయ పరిష్కారాలతో ప్రజల వద్దకు లోక్ సత్తా

-   2023 సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ -   లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో తీర్మాణం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రత్యామ్నాయ రాజకీయ పరిష్కారాలతో ప్రజల వద్దకు వెళ్ళాలని, 2023 సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో తీర్మానించారు. సోమవారం హాబిట్స్ లోని చంద్ర లోక్ కాంప్లెక్స్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. కార్యవర్గ సమావేశం అనంతరంఏర్పాటు చేసిన  మీడియా సమావేశం లో తుమ్మనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ రాజకీయ పరిష్కారాలతో ప్రజల వద్దకు వెళ్లాలని 2023 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశం అన్ని స్థానాలకు తీర్మానించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ అనుచ్చితి నెలకొందని అధికార ప్రతిపక్ష పార్టీలు విధానాలకు పరిమితమై ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని ఆయన విమర్శించారు. విమర్శలకు ప్రతి విమర్శలతోనే అవి వెలబుస్తున్నాయని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ప్రజలు కేంద్రంగా పరిపాలన జరగాలంటే అది సత్తా పార్టీ పార్టీకి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు దళిత బంధువు పతకం లో  లంచాలు మెక్కారని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం అధికార పార్టీ దిగజారిన విధానాలకు నిదర్శనమని అన్నారు. లంచాలుమెక్కిన ప్రజాప్రతినిధులు జాబితాలను వెంటనే బయటపెట్టాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.అట్టి  అవినీతి సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని తుమ్మలపల్లి డిమాండ్ చేశారు ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వ వైఖరి పలు అనుమానాలకు సావిస్తుందని సమావేశం అభిప్రాయం పడిందన్నారు. మద్యంఅమ్మకాలను  ప్రభుత్వం ప్రధాన ఆదాయం మనరుగా చూడటం వల్ల యువత మహిళలు బ్రతుకులు దుర్భరంగా మారాయని అన్నారు. నేరాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న అనేక సంఘటనలు ఉన్నాయన్నారు అయినా ప్రభుత్వం కనువిప్పు కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదని ఆయన అన్నారు. విద్యా ఆరోగ్యం సకాలంలో ఆయా కుటుంబాలకు అందక అప్పులపాలై ఆత్మహత్యలు పాల్పడుతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.