”ప్రేమ అనేది మనుసులో ఉంటుంది, దుకాణాల్లో కాదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రేమ అనేది మనుసులో ఉంటుంది, దుకాణాల్లో కాదు”అంటూ భారతీయ జనతా పార్టీ శుక్రవారంనాడు సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విపక్ష పార్టీల అవినీతిని ఎండగడుతూ ఈ వీడియో సాంగ్ రూపొందింది. ప్రేమ మనసులో ఉండేదే కానీ దుకాణాల్లో దొరికేది కాదని, ప్రేమను సంపాదించుకోవాలే కానీ ఎక్కడా అమ్మకానికి దొరకదని బీజేపీ అధికారిక ట్విట్టర్‌‌‌లో పేర్కొంది.కాంగ్రెస్ పార్టీ అంటే విసుగుపుట్టి నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నట్టు వీడియోలో చూపించారు. సబ్సిడీకి కుకుంగ్ గ్యాస్ సిలెండర్లు ఇవ్వడం సహా పేద కుటుంబాలకు బీజేపీ చేస్తున్న సాయాన్ని వీడియోలో హైలైట్ చేశారు. ఉగ్ర శిబిరాలను ఏరిపారేసిన ఉరీ ఉగ్రదాడుల ప్రాధాన్యతను, చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా నిర్వహించడాన్ని ఇందులో చూపించారు. కాంగ్రెస్ దుకాణాల్లో ఎమర్జెన్సీ, విభజన, దేశ ప్రజలను కించపరచడం వంటివి మాత్రమే దొరుకుతాయంటూ బీజేపీ చురకలు వేసింది.కాగా, లోక్‌సభలో గురువారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కూడా విపక్షాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తూర్పారబట్టారు. విపక్షాలకు ఉన్నదంతా అధికారంపై ఆకలి మాత్రమేనని అన్నారు. యూపీఏ కూడా బెంగళూరులో అంత్యక్రియలు చేసి ఐ డాట్ ఎన్ డాట్ డీ డాట్…అంటూ ‘ఇండియా’ అని పేరు పెట్టుకుని, పేరులోనే ఇండియాను ముక్కలు చేశారని విమర్శించారు. అది ఇండియా కాదని, ఘమిండియా (అహంకారుల కూటమి) అన్నారు. మణిపూర్‌తోపాటు మొత్తం ఈశాన్యంలో విచ్ఛిన్నకర శక్తులు, హింసాకాండ రగిలేందుకు కాంగ్రెస్‌ విధానాలే కారణమన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మణిపూర్‌లో ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ ఫొటోను ప్రదర్శించేవారు కాదనీ , పాఠశాలల్లో జాతీయ గీతం ఆలపించేవారు కాదనీ, ఐఏఎస్‌ అధికారులు కూడా తిరుగుబాటుదారులకు జీతంలో కొంత చెల్లించాల్సి వచ్చేదని చెప్పారు. ఈశాన్య ప్రాంతీయుల మనోభావాలను కాంగ్రెస్‌ ఎప్పుడూ అర్థం చేసుకోలేదని తెలిపారు. గత తొమ్మిదేళ్లలో తమ హయాంలో ఈశాన్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని సభకు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.