బంగాళాఖాతంలో అల్పపీడనం రెండు రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.రాష్ట్రంలో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అందువల్ల ఈ 16 జిల్లాల్లో ముంపు ప్రాంతాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జార్ఖండ్‌ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటున సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోకి దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని వివరించింది. నల్లగొండ జిల్లాలోని కనగల్లో 77.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈనెల 25న రాజస్థాన్‌లో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షకాలం సీజన్‌లో రాష్ట్రంలో 15 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎలినినో ప్రభావం గురించి డిసెంబర్‌లో అంచనా వేయవచ్చని వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.