ఈనెల 29న చంద్రగ్రహణం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 29వ తేదీన చంద్రగ్రహణం కారణంగా … తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని, రాజన్న ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న అన్ని ఆలయాలను మూసేస్తున్నట్లు సదరు ఆలయ అధికారులు ప్రకటించారు. సూర్యగ్రహణం పూర్తయిన 14 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఒకే నెలలో రెండు గ్రహణాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. దేవాలయాలను మూసేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటన చేశారు.టిటిడి అధికారులు మాట్లాడుతూ … 29వ తేదీ తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల వరకు చంద్రగ్రహణం ఉండటంతో 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 29వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నామని తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకరణ సేవ, వఅద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువైన కారణంగా … అక్టోబర్‌ 1, 7, 8, 14, 15 తేదీల్లో సర్వదర్శనం టోకెన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు మాట్లాడుతూ … ఈ నెల (28-10-2023) శనివారం మధ్యాహ్నం 1.16 నుంచి 1.51 గంటల వరకు రాహు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాజన్న ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆలయాలను కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం సాయంత్రం 4:15 గంటల నుండి ఆదివారం గ్రహణం తర్వాత (29-10-2023) ఆలయాలకు తిరిగి, గ్రహణం అనంతరం 3:40 నిమిషాలకు సుప్రభాత పూజలు నిర్వహించి, భక్తులకు దర్శనం కోసం సేవలు ప్రారంభిమని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.