ఎగిరేందుకు సిద్ధంగా ఎల్వీఎం3 రాకెట్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అత్యంత హెవీ రాకెట్‌ ఎల్‌వీఎం3 ను ఇస్రో ప్రయోగించనున్నది. అక్టోబర్‌ 2౩వ తేదీన ఆ రాకెట్‌ నింగికి ఎగురుతుంది. బ్రిటీష్‌ స్టార్టప్‌ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఆ రాకెట్‌ మోసుకెళ్లనున్నది. శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరగనున్నది. లాంచ్‌ వెహికిల్‌ మార్క్‌ 3ని గతంలో జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 అని పిలిచేవారు.అక్టోబర్‌ 23న ఉదయం ఏడు గంటలకు ఎల్‌ఎంవీ 3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ప్రస్తుతం ఆ రాకెట్‌కు చెందిన క్రయో స్టేజ్‌ఈక్విప్మెంట్‌ బే అసెంబ్లింగ్‌ ముగిసినట్లు ఇస్రో తెలిపింది. వాహననౌకకు ఉపగ్రహాలను అమర్చినట్లు కూడా ఇస్రో చెప్పింది. రాకెట్‌ ఫైనల్‌ చెకింగ్‌ నడుస్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.ఎల్‌ఎంవీ 3 రాకెట్‌ సుమారు నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ వరకు మోసుకెళ్లగలదు.

Leave A Reply

Your email address will not be published.