వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న బార్యకు కు మెయింటేనెన్స్ ఇవ్వ‌లేము

          స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్ట్

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: అక్ర‌మ సంబంధం పెట్టుకున్న భార్య‌.. భ‌ర్త నుంచి మెయింటేనెన్స్ కోర‌డం త‌గ‌దు అని క‌ర్నాట‌క హైకోర్టు పేర్కొన్న‌ది. మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ఆమెకు మెయింటేనెన్స్ ఇవ్వ‌లేమ‌ని కోర్టు చెప్పింది. గృహ హింస చ‌ట్టం ప్ర‌కారం త‌న‌కు భ‌ర్త నుంచి మెయింటేనెన్స్ ఇప్పించాల‌ని భార్య పెట్టుకున్న కేసును జ‌స్టిస్ రాజేంద్ర బాదామిక‌ర్ విచారించారు. ఆ మ‌హిళ వ్య‌క్తిత్వం నిజాయితీగా లేద‌ని, ఆమె ప‌క్కింటి వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంద‌ని, అత‌నితోనే ఆమె ఉంటోంద‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. పిటీష‌న‌రే అక్ర‌మ సంబంధం పెట్టుకున్న‌ప్పుడు, ఆమె ఎలా మెయింటేనెన్స్ కోరుకుంటుంద‌ని కోర్టు ప్ర‌శ్నించింది.పిటీష‌న‌ర్ ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేని కార‌ణంగా ఆమెకు రావాల్సిన మెయింటేనెన్స్ ఇవ్వ‌లేమ‌ని కోర్టు తెలిపింది. భ‌ర్త మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు భార్య చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది. భార్య‌కు మెయింటేనెన్స్ ఇవ్వాల‌ని గ‌తంలో మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ భ‌ర్త కోర్టును ఆశ్ర‌యించాడు. మెజిస్ట్రేట్ ఆదేశాల‌ను అద‌న‌పు సెష‌న్స్ జ‌డ్జి కొట్టిపారేశారు. దీంతో మ‌ళ్లీ రివిజ‌న్ పిటీష‌న్ వేసింది ఆ మ‌హిళ‌. ఆ కేసులో హైకోర్టు తీర్పునిస్తూ.. అక్ర‌మ సంబంధం పెట్టుకున్న మ‌హిళ‌కు మెయింటేనెన్స్ ఇవ్వ‌లేమ‌ని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.