11న జరిగే నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేయండి

- ఎంపీ బండి సంజయ్ కుమార్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  ఈనెల 11న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్’’ను దిగ్విజయవంతం చేసి సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కు జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ విజయశాంతి పాల్గొనే ఈ నిరుద్యోగ మార్చ్ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌజ్ నుండి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొద్దిసేపటి క్రితం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి టి.వీరేందర్ గౌడ్, ఆకుల విజయ, దరువు ఎల్లన్న, పుల్లారావు తదితరులు పాల్గొన్న ఈ టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోనిముఖ్యాంశాలు….

• కేసీఆర్ అనాలోచిత విధానాలవల్ల తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదమేర్పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భ్రుతిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజల బతుకు అథో:గతి పాలవుతున్నా సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణం.

• తూతూ మంత్రంగా కొంతమందిని అరెస్ట్ చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. సిట్ దర్యాప్తు నిందితులకు కొమ్ముకాయడానకే పనిచేస్తోందే తప్ప నివేదిక ఇచ్చిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ తోపాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం.

• ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీజేపీ చేస్తున్న ఉద్యమాలను గమనిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా బీజేపీకే ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేశారు. ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో చేపట్టే నిరుద్యోగ మార్చ్ ను సక్సెస్ చేసి ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీకి అడ్డా నిరూపించాలి. అందుకోసం నిబద్ధత కలిగిన కార్యకర్తలంతా ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనాలి. పోలింగ్ బూత్ సభ్యులంతా ఒక్కొక్కరు కనీసం వందమందిని తీసుకురావాలి. మీడియా, సోషల్ మీడియాలో విస్త్రత ప్రచారం నిర్వహించాలి.

Leave A Reply

Your email address will not be published.