మేకిన్‌ ఇండియా జోకిన్‌ ఇండియాగా మారింది

- సిఎం కెసిఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మేకిన్‌ ఇండియా జోకిన్‌ ఇండియాగా మారిందని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. మహారాష్ట్ర నాందేడ్‌లోని గురుగోవింద్‌ సింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై మండిపడ్డారు. 54 సంవత్సరాలు దేశాన్ని కాంగ్రెస్‌, 16 సంవత్సరాలు బీజేపీ పార్టీలు పాలించాయని, రెండు పార్టీలు ఏం సాధించాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆలోచనలు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు.నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావంటూ కాంగ్రెస్‌, బీజేపీ తిట్టుకుంటున్నాయని విమర్శించారు. ఈ వెనుకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణం. ఒకరు అంబానీ అంటే మరొకరు ఆదానీ అంటారని ఆరోపించారు. చిన్నచిన్న పట్టణాల్లోనూ చైనాబజార్లు ఎందుకు ఉన్నాయని నిలదీశారు. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు, చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయన్నారు. దేశమంతా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. చైనా బజార్లు పోయి భారత్‌ బజార్లు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నాందేడ్‌లో ఎన్ని చైనాబజార్‌లు ఉన్నాయో లెక్కబెట్టారా? ప్రశ్నించారు. ప్రధాని మన్‌కీ భారత్‌ పేరుతో ప్రజలను వంచిస్తున్నారని, ఇది రాజకీయం కాదు.. ఇది జీవన్మరణ సమస్య అన్నారు.

Leave A Reply

Your email address will not be published.