మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: త్వరలో నిర్వహిస్తున్న మన ఊరుమన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కందుకూరు మండల పరిషత్‌ సమావేశపు హలులో పీటీసీలుసర్పంచ్‌లుప్రజాప్రతినిధులుఅధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. ప్రతి మండలంలో 20పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మౌలిక వసతుల కోసం రూ. కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరుమన బడి కార్యక్రమంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు బడుల రూపురేఖలు మారుతాయని తెలిపారు.కందుకూరు మండలం ఫార్మాసిటీ మీర్‌ఖాన్‌పేట్‌ వద్ద కళాశాలతో పాటు మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో విద్యాసంస్థల ఏర్పాటుకు కందుకూరు హబ్‌గా మారుతుందని వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డిఎంపీపీ మంద జ్యోతి పాండుమార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురుసాని సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.