ఆధునిక హంగులతో మానేరు ఫ్రంట్‌ నిర్మాణం

- బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఆధునిక హంగులతో మానేరు ఫ్రంట్‌ను నిర్మిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెనపై రూ.6.5కోట్లతో ఏర్పాటు చేయనున్న డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వంతెనెకు హంగులు తీసుకువచ్చేందుకు డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌ పనులను ప్రారంభించుకోనున్నట్లు పేర్కొన్నారు.త్వరలోనే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.ఈ వాటర్‌ ఫౌంటెన్‌లు ప్రపంచవ్యాప్తంగా మూడు దేశాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. చైనా, సౌత్‌ కొరియాలోని సియోల్‌ తర్వాత కరీంనగర్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటి మేయర్ చల్ల స్వరూపరాణి, కరీంనగర్, జిందా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఆర్డీవో ఓ ఆనంద్ కుమార్, కొత్తపెల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఆర్అండ్‌బీ ఈఈ సాంబశివరావు, డీఈ రవీందర్, ఏఈ రాజాశేఖర్, అశోక్, కాంట్రాక్టర్ కమాలుద్దీన్ ఇతర అధికారులు కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.