12 వ సారి తండ్రి అయిన మాస్క్
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రపంచ కుబేరుల్లో ఒకరు. స్పేస్ X వ్యవస్థాపకుడు. టెస్లా, సోషల్ నెట్వర్క్ ఎక్స్ (ట్విటర్) యజమాని ఎలన్ మాస్క్. తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు మస్క్. ఇటీవల ఈవీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా మస్క్ గురించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. అదేంటంటే… ఎలాన్ మస్క్ 12వ సారి తండ్రి అయ్యారట. అయితే, ఈ విషయాన్ని మస్క్ గోప్యంగా ఉంచారట. ఎలాన్ మస్క్‌కి చెందిన న్యూరాలింక్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న షివోన్ జిలిస్ అనే మహిళతో కలిసి ఇద్దరు పిల్లలను కన్నట్లు జర్నలిస్టులు కనిపెట్టారు. ఈ విషయాన్ని మస్క్ దాచిపెట్టినట్లు గుర్తించారు. జర్నలిస్టులు చెప్పిన దాని ప్రకారొ… ‘‘మస్క్ ఇప్పుడు 12 మంది పిల్లలకు తండ్రి. 12 మందిలో ఆరుగురు గత ఐదేళ్లలో జన్మించారు. వారిలో ముగ్గురు సింగర్ గ్రిమ్స్‌తో జన్మించగా… మరో ముగ్గురికి శివోన్ జిలిస్‌తో జన్మనిచ్చారు. ప్రస్తుతం గుర్తించి 12వ సంతానం ఈ ముగ్గురిలో ఉన్నారు. అయితే, 12వ సారి తండ్రి అయిన విషయాన్ని గొప్యంగా ఉంచాలని మస్క్ కుటుంబం నిబంధన పెట్టుకున్నట్లు ఆయనకు సన్నిహితంగా ఉండే ఒకరు చెప్పారు. 12వ సంతానం ఈ సంవత్సరం ప్రారంభంలో జన్మించగా… అప్పటి నుంచి ఈ విషయాన్ని మస్క్ ఫ్యామిలీ రహస్యంగా ఉంచింది. దీనిపై జిలిస్గానీ, మస్క్‌గా స్పందించలేదు. దీంతో 12వ సంతానం అమ్మాయా..? లేక, అబ్బాయా..? అన్న విషయం తెలియలేదు. ఎలాన్ మస్క్‌కి పిల్లలంటే చాలా ఇష్టం. ఇది రహస్యమేమీ కాదు. మస్క్ కొన్నిసార్లు తన సంతానంతో బయటకు కనిపిస్తారు కూడా. అయితే, వారి గురించి చర్చించడానికి ఇష్టపడరు. అదేవిధంగా మస్క్ 12వ సారి తండ్రి అయిన విషయాన్ని బయటపెట్టలేదు. ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొన్న ప్రకార… ఇప్పటికే ఎలాన్ మస్క్- శివోన్ జిలిస్‌కు ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. వారిలో ఒకరి పేరు అజూర్, మరొకరు స్ట్రైడర్.