భారీ ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మకం పైన చిత్తూరు జిల్లా ఎస్పి రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు,చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి నేతృత్వంలో దాడులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యచరణలో భాగంగా రాబడిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ సిఐ మద్దయ్యాచారి మరియు చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్ ఎస్సై రామ్ క్రిష్ణ మరియు సిబ్బందితో కలసి చిత్తూరు జిల్లా,చిత్తూరు మండలం,తిరుపతి – బెంగళూరు పాత బైపాస్ రోడ్డు నందు SITAMS కాలేజీ ఎదురుగా బెంగళూరు వైపు నుండి చిత్తూరు వైపుకు అనుమానాస్పదంగా వస్తున్న ఒక చేవ్రోలేట్ కారును అదుపులో తీసుకొని తనిఖి చేసి అందులో అక్రమంగా రవాణా చేస్తున్న 15 కేసులు మరియు ఒక సంచిలోని కర్ణాటక మద్యంను గుర్తించి,అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు S.మణిగండ, N.P.ప్రవీణ్ లను అదుపులోకి తీసుకోగా కుమరేశన్ అను మరొకవ్యక్తి తప్పించుకొని పారిపోయినట్టు,అంతటా పట్టుబడిన ముద్దాయిలను విచారించగా సదరు వార్లు కర్ణాటక మద్యంను కర్ణాటక రాష్ట్రం నుండి మనరాష్ట్రంకు అక్రమంగా భారి ఎత్తున రవాణచేసి పెద్దఎత్తున డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిసింది.సదరు పట్టుబడిన ముద్దాయి S.మణిగండ పై జిల్లాలో రెండు మద్యం అక్రమ రవాణ కేసులు ఉండి జైలుకు కుడా వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అరెస్టు అయిన వారిలో.S.మణిగండ,వయస్సు(38), తండ్రి .R.సుకుమార్, డోర్ నేం.20-552, C.K.B.స్ట్రీట్, మిట్టూర్,చిత్తూర్ టౌన్ ,

2.N.P.ప్రవీణ్,వయస్సు(37), తండ్రి N.V.పరమాత్మ,డోర్ నం.4-1672,దుర్గానగర్ కాలనీ,చిత్తూర్ టౌన్ మరియు మండలం. పరారీ లో ఉన్న నిందితుడు 1.E.కుమరేశన్,తండ్రి M.ఎకాంబరం,గాయత్రినగర్,చిత్తూరు టౌన్  గా పోలీసులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.