వాతావరణ శాఖ అలర్ట్‌

- మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

0.73760900_1666073680_cyclone.jpg

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నెట్ వర్క్ ఇంచార్జ్: ఈ ఏడాది వర్షాకాలంలో దేశ వ్యాప్తంగా కురిసిన వర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలతో జన జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. తక్కువ సమయంలోనే అన్ని ప్రాజెక్టులు, నదులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. ఇక తాజాగా మరో తుఫాను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అదే మండూస్‌ తుఫాను. ఇది తీరం దాటి బలహీనపడినప్పటికీ ఆ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరో అల్పపీడనం ముప్పు ముంచుకువస్తుండటంతో అందరిలో టెన్షన్‌ నెలకొంది. ఏపీ, యానాంలలో గాలులు వీస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం దానికి అనుకుని ఉన్న మలక్కా, సుమత్రా జలసంధి వద్ద గల ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు.

దీని ప్రభావంతో గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఉన్న హిందూమహాసముద్రం మీద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ దిశగా శ్రీలంక తీరం వైపు కదులుతోందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది.

ఏపీకి మాండూస్‌ ఎఫెక్ట్‌

ఏపీకి మాండూస్‌ తుఫాను ఎఫెక్ట్‌ ఉండనుంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. పుత్తూరు, నగరిలో తుఫాను ప్రభావంతో చాలా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మంత్రి రోజా ఆయా ప్రాంతాల్లో తిరిగి పరిశీలించారు. తడూరు వద్ద అండర్‌ బ్రిడ్జిలో వరద నీరు నిలిచిపోవడంతో యంత్రాల సాయంతో పనులు చేపట్టారు అధికారులు.

పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోవడంతో తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తుఫాను ప్రభావం కారణంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.