ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి.. నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మరిన్ని వానలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈశాన్య అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా రెండు ద్రోణులు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు.శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో.. అలాగే సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు.ఆది, సోమవారల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వాన పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కడప, అన్నమయ్య తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.మరోవైపు తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రానున్న రెండు వారాలు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయంటున్నారు. ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాల కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ నెల 18 వరకు భారీగా వానలు పడతయాని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.