అర్ధరాత్రి ఇసుక దొంగలు

- దామరంచ శివారు నుండి ఇసుక అక్రమ రవాణా

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ బీర్కూర్ : మంజీరా నది అక్రమార్కులకు కాసులు కురిపించే యంత్రం లా మారిపోయింది. బీర్కూరు మండలం దామరంచ గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అర్ధరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా దర్జాగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రజా ప్రతినిధితో పాటు మరికొంతమంది జట్టుగా మారి రాత్రి వేళ ట్రాక్టర్ సహాయంతో ఇసుకను బాన్సువాడ ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామస్తులు ఎవరైనా ప్రశ్నిస్తే తన వెనక పెద్దలు ఉన్నారని నన్ను ఎవరైనా పాల్పడుతున్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా అర్ధరాత్రి వేళ దామరంచ గ్రామం నుండి అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నప్పటికి రెవెన్యూ అధికారులు కానీ, పోలీసులు కానీ దాడులు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. గ్రామానికి చెందిన వీఆర్ఏ లు సైతం అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దామరంచ గ్రామ శివారులోని మంజీర పరివాహక ప్రాంతం నుండి ప్రతిరోజు అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయడంపై అనుమానాలు కలుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యర్థం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Leave A Reply

Your email address will not be published.