కొల్లేరుకు వలస పక్షులు వచ్చేశాయ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రపంచంలోనేకొల్లేరు సరస్సుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దేశ, విదేశాల నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు పక్షులు చేరుకుంటాయి. వీటికి ఆటపాక పక్షుల కేంద్రం స్వర్గధామం. ఎటు చూసినా నీరు, తినేందుకు ఆహారం సమృద్ధిగా దొరకుతుండడంతో ఈ ఏడాది గతంకంటే ఎక్కువ పక్షులు వస్తాయన్నది అటవీ శాఖ అధికారుల అంచనా. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు వరదతో సరస్సు నిండుకుండలా మారి, ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. వలస పక్షులు సంతానోత్పత్తి చేసుకుని మార్చి నాటికి తిరిగి ఆయా దేశాలకు వెళ్లిపోతాయి. ఈ సరస్సు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నీరు పుష్కలంగా ఉండడంతో రోజు రోజుకు మత్స్య సంపద పెరుగుతోంది. దీంతో పక్షుల ఆహారానికి కొదవ లేకుండా అందుతోంది. ఆలపాడు నుంచి కొల్లేటి కోట వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరు వైపులా కొల్లేరు సరస్సు, సర్కార్‌ కాల్వపై ఉన్న ఐరన్‌ వంతెన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. పక్షులు చేపలను వేటాడే తీరు ఆకర్షణీయంగా ఉంటుంది. విదేశీ వలస పక్షులకు స్వర్గధామమైన ఈ సరస్సుకు పక్షులు వేలాదిగా తరలి వస్తుంటాయి. ఈ సరస్సులో ప్రధానంగా పెలికాన్‌, పెయింటెడ్‌ స్టాక్‌, వైట్‌ఐబీస్‌, నైట్‌ హెరాయిన్‌, నల్ల కంకణాల పిట్ట, పరజలు, నారాయణ పక్షి, పాము మెడబాతు, కామన్‌ మోర్‌హెన్‌ (జమ్ముకోడి), కొల్లేటి కొంగలు చేపలను వేటాడుతున్న తీరు ఆహ్లాదపరుస్తుంది.
ప్రపంచంలోనే కొల్లేరు సరస్సుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దేశ, విదేశాల నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు పక్షులు చేరుకుంటాయి. వీటికి ఆటపాక పక్షుల కేంద్రం స్వర్గధామం. ఎటు చూసినా నీరు, తినేందుకు ఆహారం సమృద్ధిగా దొరకతుండడంతో ఈ ఏడాది గతంకంటే ఎక్కువ పక్షులు వస్తాయన్నది అటవీ శాఖ అధికారుల అంచనా. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు వరదతో సరస్సు నిండుకుండలా మారి, ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. వలస పక్షులు సంతానోత్పత్తి చేసుకుని మార్చి నాటికి తిరిగి ఆయా దేశాలకు వెళ్లిపోతాయి. ఈ సరస్సు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
నీరు పుష్కలంగా ఉండడంతో రోజు రోజుకు మత్స్య సంపద పెరుగుతోంది. దీంతో పక్షుల ఆహారానికి కొదవ లేకుండా అందుతోంది. ఆలపాడు నుంచి కొల్లేటికోట వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరు వైపులా కొల్లేరు సరస్సు, సర్కార్‌ కాల్వపై ఉన్న ఐరన్‌ వంతెన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. పక్షులు చేపలను వేటాడే తీరు ఆకర్షణీయంగా ఉంటుంది. విదేశీ వలస పక్షులకు స్వర్గధామమైన ఈ సరస్సుకు పక్షులు వేలాదిగా తరలి వస్తుంటాయి. ఈ సరస్సులో ప్రధానంగా పెలికాన్‌, పెయింటెడ్‌ స్టాక్‌, వైట్‌ఐబీస్‌, నైట్‌ హెరాయిన్‌ (గుడ్డుబాస), నల్ల కంకణాల పిట్ట, పరజలు, నారాయణ పక్షి, పాము మెడబాతు, కామన్‌ మోర్‌హెన్‌ (జమ్ముకోడి), కొల్లేటి కొంగలు చేపలను వేటాడుతున్న తీరు ఆహ్లాదపరుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.